Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నడిపించారు. ప్రభుత్వం కారాగారశిక్ష విధించి వీరిని తీసికొని వెళుతున్నప్పుడు అప్పటికే అధిక కీర్తిప్రతిష్ఠలు ఆర్జించుకొన్న విశ్వనాథ సత్యనారాయణ, కొడాలి సుబ్బారావు, కొడాలి ఆంజనేయులు మొదలైన కవి ప్రముఖులు సహితం గుంటూరు రైల్వే స్టేషన్ దాక వెంట నడచివెళ్లి చింతాక్రాంతులవుతూ వీడ్కోలు చెప్పటం, వీరి దేశభక్తిని విశిష్టంగా గౌరవిస్తూ ప్రచారం చేయటం సాహిత్యలోకాన్ని ఆకర్షించాయి. ఈ సందర్భంలో శివశంకర స్వామిని శ్రీ గిడుగు రామమూర్తి పంతులు 24-10-1930న పర్లాకిమిడి నుంచి కడలూరు కారాగారానికి వ్రాసిన లేఖలో ఇలా ప్రశంసించారు.

“మీ విషయమై ఆంధ్రపత్రికలో ప్రకటితమైన వార్తలు చూస్తూనే ఉన్నాము. మీ అవస్థ తలచుకొని దుఃఖిస్తూ ఉంటాను. కానీ మీరు ప్రకటించిన దేశాభిమానం స్థైర్యము ధైర్యము కొనియాడదగినవేను. మీది నిష్కలంకమైన ప్రవర్తన. మీవంటివారికి ఇట్టిపాట్లు కలగడం దురదదృష్టం. మీ ఫొటోగ్రాఫు మా కంటి ఎదుటనే ఉంటున్నది. అది ఉండకపోయినా ప్రియమిత్రులైన మిమ్ము తలచుకోకుండా ఉండగలమా? బందిఖానాలో ఉన్నా మీరు క్రొత్త గీతాలు రచిస్తున్నారు. బందిఖానా మీ మనసునూ మీ ఉత్సాహాన్ని అరికట్టలేదు. మనకు ప్రాణ ప్రియమైన వాడుక భాషలో “మాలపల్లి” శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు రచించినట్లే మీరు కూడా ఏదైనా గొప్ప గ్రంథము రచిస్తారని అనుకుంటూ ఉంటిని. ఇప్పుడు కాకపోతే ఏమాయెను; విముక్తి అయినతరువాతే “స్థిత ప్రజ్ఞులు” మీ సంకల్పం వల్లను అట్టిది పుట్టవచ్చును. మీరు మీ ప్రతిజ్ఞను పరిపాలించుకోగలరని నేనెరుగుదును. అది చూడటానికి ఐనా బ్రతికి ఉండగలననే ఆశతో ఉన్నాను.”

శివశంకరస్వామి ప్రఖ్యాతులైన దేశభక్తి తత్పరులు, జాతీయోద్యమ నాయకులు, సంఘ సంస్కార ప్రియులు కావటం వల్లనే, తెలుగు జాతికి మహా నాయకులైన ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిత్వం వహిస్తున్నప్పుడు, 1946లో వ్రాసుకొన్న తమ “ఆత్మకథ” అన్న మహాగ్రంథానికి అభిలాషతో అర్థించి శివశంకర స్వామి చేత పీఠిక వ్రాయించుకోవటం జరిగింది.

కారాగారంనుంచి చివరిసారి తిరిగివచ్చిన తరువాత బహుపాశ్చాత్య భారతీయ భాషాభిజ్ఞులు, భారతీయ సంస్కార ప్రియులు, కవిశేఖరులు అని ప్రఖ్యాతిగన్న శివశంకరస్వామివారిని, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి మహాశయులు 1933 జులైలో మహాకవి రవీంద్రనాథుని శాంతినికేతనంలో తెలుగు ప్రొఫెసర్గా నియోగింప జేయటానికి ప్రయత్నం చేశారు. కాని అనిర్వచనీయ కారణాలవల్ల వీరు అందుకు


506

వావిలాల సోమయాజులు సాహిత్యం-4