Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెంకటేశ్వరులు మొదలైనవారు సభ్యులుగా ఉంటున్న “రామవిలాససభ” అనే తెనాలి నాటక సంస్థకు గౌరవనీయ దర్శకులుగా వర్తించి, అనేక నూతన పరివర్తనలను, అభినయ విశేషాలను ప్రవేశపెట్టి క్రమశిక్షణతో నటనాకౌశలాన్ని పెంపొందించి దక్షతతో యావదాంధ్రదేశంలోను అత్యుత్తమంగా నాటక ప్రదర్శనలను నడిపించి కీర్తిగన్నారు.

1923-27లలో శివశంకరస్వామి రాజమహేంద్రవరంలోని అద్దేపల్లి లక్ష్మణస్వామి నాయుడుగారి "సరస్వతీ గ్రంథమండలి"కి గౌరవ సంపాదకులై ఉద్యోగిస్తూ, ఎందరో నాటక కర్తలకు, నవలాకారులకు దోహదమిచ్చి ప్రోత్సహించారు. వీరు 1923లో కాంచనమాల, 1926లో కుంకుమభరిణె అన్న వంగభాషా నవలలను అనువదించి ప్రకటించారు. 1924లో మచిలీపట్నంలోని జాతీయ కళాశాలలో లోకవిఖ్యాతి గన్న చిత్ర కళాకారుడయిన ప్రమోదకుమార చటర్జీ దగ్గర చిత్రకళ అభ్యసించాలన్న కుతూహలంతో వీరు కొంతకాలం గడిపారు. 1925-30లలో పాశ్చాత్య భాషలకు మూలకందమైన లాటిన్ భాషను, ఫ్రెంచి భాషను కొంతవరకు అభ్యసించారు.

విపులమైన రాజకీయ విజ్ఞానాన్ని ఆర్జించిన శివశంకరస్వామి దృష్టి విశేషంగా 1928 నుంచి జాతీయోద్యమం మీద, సంఘసంస్కరణ, దేశసముద్ధరణలమీద ప్రసరించటం ప్రారంభించింది. ఆ సమయంలో వీరు ఆంధ్ర రాష్ట్రాద్యమాదుల వల్ల విశేష ఖ్యాతి నార్జించిన గుంటూరులోని “యంగ్మెన్స్ లిటరరీ ఎసోషియేషన్” లోని ప్రముఖ సభ్యులలో ఒకరైనారు. 1928-29లలో గుంటూరులోని "శ్రీకృష్ణాశ్రమం” అనే నిమ్నజాత్యుద్ధరణ సంఘ పాఠశాలకు ఉపాధ్యాయులుగాను, ఆ సంస్థలో నడపబడే జాతీయ పరిశ్రమలకు పర్యవేక్షకులుగాను వ్యవహరిస్తూ దేశసేవ చేశారు. సర్వతంత్ర స్వతంత్రులు దేశస్వాతంత్ర్య ప్రియులు అయిన వీరు శ్రీ కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, నడింపల్లి నరసింహారావు, అమంచర్ల శేషాచలపతి మొదలైన దేశభక్తి తత్పరులు, దేశస్వాతంత్ర్య ప్రియులు అయిన నాయకాగ్రణ్యుల స్నేహ ప్రభావ పరిచయ ప్రియాల మూలంగాను, గాంధీ మహాత్ముని శంఖారావం కర్ణగోచరం కావటం వల్లను సహాయ నిరాకరణోద్యమంలో ఈ సమయాన విశేష కృషి చేస్తుండేవారు. శివశంకరస్వామి 1930-32లలో ముమ్మారు కఠిన కారాగారశిక్షలు అనుభవించారు. ఆ సమయంలో వీరు గుంటూరు మండల కాంగ్రెస్ కార్యదర్శిగాను, అఖిలాంధ్ర కాంగ్రెస్ సభ్యులుగాను ఎన్నుకోబడి అధిక గౌరవాన్ని వహిస్తూ మహోద్యమాలను


సాహిత్య విమర్శ

505