Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమితివారు ప్రాచీనపంథాను విడిచి, సాహిత్యరంగంలో నవ్యవీథులు నిర్మించి యువత హృదయాలల్లో నూతనసృష్టి కోసం తపన కల్పించటం జరిగాయి. అనతికాలంలో సాహితీ సమితి సభ్యులు తమ రచనల మూలంగా జనాదరణ పాత్రులైనారు. "ప్రాచీన సాహిత్యానికి సాహితీ సమితి స్థాపనము ఒక సీమావధి. అది అంతకు ప్రాచీన యుగానికి ఆశ్వాసాంతము. నవీనయుగానికి నాందీ ప్రస్తావము. సాహితీ సమితి వారు చిరస్మరణీయులు" అని మహాచరిత్రకారులు శ్రీ మల్లంపల్లివారు సాహితీసమితిని, తన్మూలంగా సభాపతులైన శివశంకర స్వామిని అభినందించారు. శివశంకరస్వామి సాహితీ సమితిని నిర్వహించటంలో గాఢమైన క్రమశిక్షణను, మహాదక్షతను ప్రదర్శించటాన్ని సహించలేని కొందరు సభ్యులు, 1925లో విడివడటం జరిగింది. శివశంకరస్వామి స్వపక్షము వారైన సభ్యులను ఉల్లాసపరచి 1925లో "సఖి” అన్న సుందర త్రైమాసపత్రికను పెట్టించి దానిని కొంతకాలం శక్తిమంతంగా నడిపించారు. శివశంకరస్వామి సభాపతిత్వాన సాహితీసమితి, వారి అస్తమయం వరకు నవ్యసాహిత్య సేవ చేస్తూనే ఉన్నది.

"స్వామి శివశంకరశాస్త్రులు తమ గ్రంథాల వల్లనే కాక సాహితీ సమితి ద్వారా కూడా నవ్య కవిత్వానికి సాహిత్యానికి గొప్ప పటిమ ఇచ్చారు. వీరు మహావ్యక్తి; వీరే ఒక సంస్థ. ఎన్ని భాషలో వీరెరుగుదురు. ఎన్నో సాహిత్య హృదయాల లోతులలో తరచి చూచారు. కాని సంస్కృత వాఙ్మయమంటే మోజు ఎక్కువ. వీరి హృదయం ఎంత ఆర్ద్రమో అకలంకమో కాకపోతే, వీరి ప్రతిభ ఎంత గాఢము నిశితము కాకపోతే చిత్రచిత్ర ప్రకృతులు గల కవుల నందరిని ఒక కూటంలో అంతకాలం కూర్చి ఉంచగలరు!"... అని కృష్ణశాస్త్రి ఆ నాటి శివశంకరస్వామి మీద ఇచ్చిన హృదయ పూర్వకమైన అభిప్రాయం సమస్త సాహితీ సమితి సభ్యుల అభిప్రాయ మనటంలో అసత్యం లేదు.

శివశంకరస్వామి 1920లో "మాధవీకంకణము” అనే వంగ నవలను ఆంధ్రీకరించారు. వీరు 1922లో తెనాలి జాతీయ కళాశాలలో ఉద్యోగం నిర్వహిస్తూ, కురుగంటి శ్రీరామశాస్త్రులవారి వద్ద తర్కాన్ని, జగద్గురు కల్యాణానంద భారతీస్వామి వారివద్ద సూత్రభాష్యాలను, అద్వైత వేదాంత గ్రంథాలను పఠించారు.

వీరు 1921-22లలో తరువాత మహానటకులని విఖ్యాతి గన్న స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, కన్యాశుల్కంలోని గిరీశం పాత్రను ప్రదర్శించటంలో పరమ ప్రఖ్యాతి వహించిన గోవిందరాజుల సుబ్బారావు, పులిపాటి


504

వావిలాల సోమయాజులు సాహిత్యం-4