ఈ 1914లోనే ఉర్దూ, పారశీక భాషలను అభ్యసిస్తూ “రసపుత్ర జీవనసంధ్య” అనే హిందీ నవలను అనువదించి ప్రకటించారు. 1915లో అభిమానంతో జర్మనీ భాష శ్రమపడి నేర్చుకొన్నారు. ఈ సంవత్సరంలోనే వీరు "మురారి కథలు" అనే శీర్షిక క్రింద “గాదె” మొదలైన మౌలిక కథలను రచించి, అనతికాలంలో కథాసాహిత్య మాసపత్రికను ప్రకటించటానికి ప్రయత్నించారు.
స్వామి శివశంకరులు 1916లో బొంబాయి మహానగరంలోని "జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్"లో కొంతకాలం శిల్పాన్ని అభ్యసించారు. ప్రారంభదశలో చక్కని సౌందర్య దృష్టిగల వీరు చిత్రాలు గీయటం, అజంతా చిత్రాలకు నకళ్లు చేయటం చేస్తుండగా ఆశ్చర్యపడి, మహారాష్ట్రుడైన శిల్పకళాగురువు “మీ రెవ” రని ప్రశ్నిస్తే “ఆంధ్రులము మహారాష్ట్రుల పూర్వికుల” మని ఆంగ్లభాషలో సగర్వంగా సమాధానము చెప్పటం వల్ల, ఆయనకు కోపం కల్గటం, వెంటనే వీరు శిల్పవిద్య మానటం జరిగాయి. కాని ఈ స్వల్ప విద్యాభ్యాసం వల్లనే శివశంకరస్వామికి ఎంతో ప్రయోజనం కలిగింది. నోబెల్ బహూకృతిని పొందిన హెమింగ్ వే అన్న నవలా రచయిత “One can learn much about the structure of prose from studying the structure of Paintings" అని అన్నాడు. శివశంకరస్వామి వచన నిర్మాణమేకాక పద్య గేయనిర్మాణాన్ని కూడా నేర్వవచ్చునని గమనించారు; అనుభవించారు.
శివశంకరస్వామి 1918లో మరాఠీభాషను, 1919-20లో వైదిక సంస్కృత, ప్రాకృత, పాళీ భాషలు నేర్చుకున్నారు. అధ్యాపకదృష్టిమీద బుద్ధి ప్రసరించటం వల్ల, వీరు ఈ మూడు సంవత్సరాలు గుంటూరు క్రైస్తవ కళాశాలలో పండితులుగా పనిచేసి, ఉత్తమ విద్యాబోధకులని విఖ్యాతిగన్నారు.
శివశంకరస్వామి 1917లో కొడవటిగంటి, కొమాండూరి, వేదుల, నోరి మొదలైన కవులను, చింతా దీక్షితులు, మునిమాణిక్యం నరసింహారావు మొదలైన కథకులను సమావేశపరచి, 'సాహితీ సమితి' అనే నవ్యసాహిత్య ప్రియుల సాహిత్య సంఘాన్ని స్థాపించారు. సర్వతోముఖ సాహిత్య ప్రజ్ఞాన్వితులు కావటం వల్ల ఈ సమితికి సభ్యులు శివశంకరస్వామిని సభాపతిగా ఎన్నుకొన్నారు. తరవాత అనతికాలంలో ప్రఖ్యాతులైన కృష్ణశాస్త్రి, నండూరి, కొడాలి ఆంజనేయులు, విశ్వనాథ, మొక్కపాటి మొదలైనవారెందరో సాహితీ సమితి సభ్యులు కావటం జరిగింది. 1920లో ప్రారంభింపబడ్డ "సాహితి" అనే మాసపత్రికను సభాపతి శివశంకరస్వామి శక్తిమంతంగా నాలుగు సంవత్సరాలు నడపటం, తద్వారాను, ఇతర విధాల సాహితీ
సాహిత్య విమర్శ
503