శివశంకరస్వామి తెలుగుదేశంలోని మంగళగిరి పుణ్యక్షేత్రానికి సమీపాన ఉన్న కాజ అనే గ్రామంలో 12-9-1892న షడ్దర్శనపారగులు. తపస్సంపన్నులు, తరతరాలుగా తురీయాశ్రమాన్ని స్వీకరించి బ్రహ్మీభూతులయిన తల్లావజ్ఝల వారి వంశంలో సుకృతి విశేషం వల్ల ఉద్భవించారు. మహా భక్తవరేణ్యులు, శ్రీకృష్ణ లీలాతరంగిణి కావ్యకర్తలు అయిన శివనారాయణ తీర్థులవారు వీరి తల్లావజ్ఝల వంశానికి మూలపురుషులు. శివశంకరస్వామివారి వంశంలో శ్రీకృష్ణ లీలాతరంగిణిని పాడటం స్త్రీలు కూడా అభ్యసించవలెనట. శక్తి లేనివారు మూడుతరంగాలైనా చెప్పుకోకపోతే నారాయణ తీర్థులవారి శాపం తగిలేదట; శివశంకరస్వామికి బాల్యంలో ప్రథమతః కర్ణగోచరమైనవి శివనారాయణ తీర్థులవారి శ్రీకృష్ణ లీలాతరంగిణి శ్లోకాలే, వ్యుత్పన్నులు, సంపన్నులు అయిన తమ తండ్రిగారు శ్రీ కృష్ణశాస్త్రిగారు, అమృత వాక్కుతో శ్రీకృష్ణ లీలాతరంగిణిలోని శ్లోకాలను అంటూ, తమచేత నిత్యం చిన్నతనంలో నటన చేయించినట్లు, అందువల్ల "శైవా వయం న ఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీకుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూకిశోరమ్" అన్న వసంతతిలక శ్లోకతాత్పర్యం తమ అంతరంగంలో అంతర్నిహితమైనట్లు, తమ వంశంలో అనుదినం పురాణశ్రవణమయ్యే ఆంధ్రభాగవతాన్ని అనవరతం పఠించటం వల్ల భగవద్భక్తి లగ్నమైనట్లు స్వామి శివశంకరులు చెప్పుకున్నారు. మహా విద్వాంసులు, సంగీతశాస్త్ర పారంగతులు, పెత్తండ్రులు అయిన నరసింహ శాస్త్రిగారు 1908లో వీరికి, శ్రీకృష్ణ లీలాతరంగిణి పాఠం చేయిస్తూ, వారికి అభిమాన కావ్యమయిన గీత గోవిందాన్ని గురించి చెప్పటం వల్ల, వీరికి గేయ రచనావిధానం మీద ఆసక్తి కలిగినట్లు, తదనంతరం అనతికాలంలోనే “కవిత్వం గేయ ప్రాయ” మన్న భావం స్ఫురించి, సుస్థిరం కావటం మొదలు పెట్టినట్లు కూడా వీరు వెల్లడించారు.
కుటుంబ ప్రభావం వల్ల స్వామి శివశంకరులకు మొదట సంస్కృత భాషాభిమానం కలిగి అది పట్టుబడ్డది. తరువాత వీరు యౌవనారంభంలోనే తెలుగు సాహిత్యం మీద విశేషకృషి చేశారు. భావంమీదనే కాక వీరికి భాష మీద కూడా విశేష ప్రీతి లభించటం, ఉపనిషత్తులవల్ల కొంత ఉద్దీప్తిని పొందటం, సహజంగా అలంకారప్రియత్వం ఉండటం మొదలయిన లక్షణాలతో సమ్మిళితమై, సరళమైన హృదయం గల వీరు సహజ కవులు కావటం, అప్రయత్నంగా వీరి నోట మొదట ఆటవెలది అవతరించటం జరిగాయి. పిమ్మట స్వామి శివశంకరుల పన్నెండో ఏట, మాలతీమాధవ నాటకంలో మాలతీ ప్రియుడైన మాధవుడు అఘోరకంఠుడనే
సాహిత్య విమర్శ
501