నూతన కవితావస్తువు, రచనాపద్ధతి కవితావేశం ప్రవేశపెట్టుటకు వీరి ప్రత్యేకత వీరి రచనామార్గాన్ని అనుసరించే వారిలో వీరి సౌలభ్యము, తత్త్వనిర్దేశము కేవల సంజ్ఞాపరిపోషక దృష్టిలోనూ, అతిశయ వ్యంగ్యసిద్ధిలోను, అతివేలమైన ఆవేశంలోనూ మాటుమణిగి పోతున్నవి.
ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, రాయప్రోలు సుబ్బారావు, తురగా వెంకట్రామయ్య, వేదుల సత్యనారాయణశాస్త్రి, బొడ్డు బాపిరాజు, దువ్వూరి రామిరెడ్డి, రామచంద్ర అప్పారావు, కొడాలి సుబ్బారావు, కొడాలి ఆంజనేయులు, శివరామం, అత్తిలి సూర్యనారాయణమూర్తి, ఉమామహేశ్, కుందుర్తి నరసింహారావు, కృత్తివాసతీర్థులు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, పిలకా గణపతిశాస్త్రి, పురిపండా అప్పలస్వామి, శ్రీరంగం నారాయణబాబు, రుక్మిణీనాథ శాస్త్రి, జనమంచి కామేశ్వరరావు, టేకుమళ్ళ కామేశ్వరరావు, కందుకూరు రామభద్రరావు, రజనీకాంతరావు, దేశిరాజు కృష్ణశర్మ, చిరంజీవి ప్రభృతులు వివిధ రకాలుగా గేయాలు వ్రాసి పేరు పొందారు, పొందుతున్నారు, పొందుతారు.
ఆధునికులు గేయరచనలమీద అభిమానోత్సాహాలు ఇనుమడించి రసవంతమైన రచనలు చేస్తారని నమ్ముతూ, చెప్పవలసినది క్లుప్తంగా ప్రతిపాదించాననే తృప్తితో విరమిస్తున్నాను. ప్రతిభ, జూలై 1940, అక్టోబరు 1941
సాహిత్య విమర్శ
499