Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నందుకున్నది. ప్రణయతత్త్వము ఈ కవి గేయనాటికల్లో గంభీరమైన దివ్యలోకాలవైపు దృష్టిని త్రిప్పుతుంది. ప్రేమ నగరానికి దారి కష్టమైనదని, అది సాధన వల్లగాని సుగమము కాదని ఆయన సూచించే భావము.

"ప్రేమ నగర కే రాహ కఠిన హై
ప్రేయసి కయి నే నేయది యైనన్
సంతోషముతో సలుపగ నేర్తున్”

అని పాడుకున్నాడు. అంత పండితుడైనా అనవసరంగా శబ్దకాఠిన్యానికి లొంగడు. ఈ గుణము పండిత కవులైన వాళ్ళల్లో ఉండటం అరుదు. శ్రుతి పుటాలకు చిన్నెలు దిద్దే గేయానికి రంగస్థలం మీదికి పరిపూర్ణ స్వరూపం రప్పించటానికి ప్రయత్నం చేసిన ప్రథమకవి శివశంకర శాస్త్రి.

చిన్న పిల్లలకు చక్కని పాటలు వ్రాయడంతో దీక్షితులదే ఉపజ్ఞ. చక్కని జాతీయ భాష, శైలీ సౌలభ్యము, చక్కని మెట్లు, గానయోగ్యత, నాతిగంభీరభావనలు, పరిశీలన, వాతావరణము వీరి పిల్లల పాటలలో ప్రస్ఫుట మౌతవి. ఉత్తమ శ్రేణికి చెందే కావ్యశిల్ప గేయరచనలు కూడా కొద్దిగా చేశారు. మనస్సు సంతోషంతో గిలిగింతలు పెట్టించే వింత వింత భావాలమీదికి వెళుతుంది ఈ 'కథక చక్రవర్తి' మనస్సు.

నవ్య గేయరచనలలో రెండు పద్ధతులు ఏర్పడ్డవి. ఒకటి భావకవుల రచనాపద్ధతి. రెండు క్రాంతిగీత రచనాపద్ధతి. ఇందులో మొదటి పద్దతిని అందరికీ అందుబాటులో ఉండకుండా సుదూరం పొడిగించిన కవి మల్లవరపు కమ్మని పదముల కూర్పంటే ఈ కవికి చాలా ఇష్టం. కొన్నిచోట్ల అర్థపుష్టి ఎంతవరకున్నదనే విషయం ఆలోచనీయాంశము. సంప్రదాయానికి ఇమడని అన్యసాహిత్య రచనాపద్ధతులేవో ప్రవేశపెట్టటానికి ప్రయత్నం చేయటం వల్ల, కొన్నిచోట్ల అన్వయ కాఠిన్యము గోచరిస్తుంది. మాత్రలు, యతులు పాటించి, లయను పాటించక పోవటము వల్ల ఏర్పడే కుంటుతనమున్నది కొన్నిచోట్ల.

మల్లవరపు నిజంగా కవితాహృదయం గల 'ఒక మహాగర్వి కవికుమారుడు' మధుకీల. కల్యాణకింకిణి వీరికావ్యాలు. సంగీతానికి స్థానమిచ్చి వ్రాసిన ప్రేమ గీతాలు రెంటిలోనూ కనిపిస్తవి. ప్రేమోజ్జ్వలత, ఉన్మత్తత, 'ఉద్రేక తాండవము' గోచరిస్తుంటవి. మొదటి రచనలో కృష్ణశాస్త్రి, నాయని, బసవరాజుల ప్రోద్బలము “చాల ఉత్సాహం, చాల అపరిపక్వత, చాలా కావ్యదోషాలు ఉన్నవి. వాటిలోనే అంతర్లీనమై ఆశలు


సాహిత్య విమర్శ

497