Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపాసన (ఆత్మచింతనకు సంబంధించినది) ఆయన భక్తి గీతాలలో బలవత్తరము. తన్మూలంగా కవి దీనతాభావాన్ని పొంది, దీనుడనని, పాపినని ప్రభువుముందు విలవిస్తాడు. బ్రహ్మ సమాజమత ప్రభావము దీనికి మూలకారణము కావచ్చు.

జాతీయ గీతాలు కమ్మని సంగీతంతో కళకళ లాడుతుంటవి. ఆకలిపాటల అంతరార్థమేమిటో ఇంకా ఆలోచించవలసిన విషయము. ఇవి విప్లవగీతాలు కావేమో! 'ప్రతిభావ్యుత్పత్తులలో ప్రతిభ గరీయసి. ' కాని వ్యుత్పత్తి ఎంత ఎక్కువగా ఉంటే ప్రతిభ అంత రాణిస్తుంది. ప్రతిభకు అండ ఆకాశము. వ్యుత్పత్తి వల్ల భావనకు బలం కలుగుతుంది. అది లేని కవిలో వస్తువైవిధ్యము తక్కువ. ఈ రెంటిని ఏకముఖం జేసుకొని గేయరచనలు చేసిన కవి విశ్వనాథ. పాడాలనే ప్రకామ్యస్థితి (Power of irresistable will) పొందినవారు ఈశత్వము (Power of Commanding), వశిత్వము (Power of subjugating) ఆయన కే నాడో హస్తగతమైనవి. వీరి కల్పనాశిల్పము, భావనాబలము, రససిద్ధి ఏ పట్టులో చూచినా గోచరిస్తాయి. 'శృంగారవీథి'లోని 'స్నానసుందరి'లో ఆయన చెప్పుకున్న 'ఊరక రసాత్మతనే స్రవియించిపోదు' అన్న మాటలలో అతిశయోక్తి లేదు. రసానికి ఆయన ప్రాణము. ఆయన జీవితమే ఒక రసమయమైన కావ్యము. అది 'వేయి పడగల'లో వెల్లివిరిసినది.

జాతీయతలోని జిగి మెరపులు చూస్తే వీరిలోనే చూడాలి. నవ్యత్వానికి ఎంత నవసిపోతాడో, సంప్రదాయానికి అంత చక్కగా లోబడతాడు.

ఒక సామాన్య భావాన్ని చిత్రించడానికి ఈ కవి దృగ్గోచర రూపం గల ఒక సంజ్ఞ (Symbol) ను మొదట్లో ఏరుకుంటాడు. ఇది ప్రతికవికీ సహజమే. ఈయన ప్రత్యేకత అక్కడ బయలుదేరుతుంది. ఆ సంజ్ఞ ఎప్పుడైతే చేత చిక్కుతుందో అప్పుడా సామాన్యభావాన్ని మఱచిపోయి ఆ రూపాన్ని మనస్సులో ధారణ చేసి దాని సౌందర్యాన్ని మనస్సులో సూక్ష్మపరిశీలన (Minute Analysis) చేసి వేయివిధాలుగా నగిషీలు దిద్ది సర్వాంగ సుందరమైన చిత్రాన్ని బయట పెడతాడు. సామాన్యుల చేతిలో సాఫీగా ఒక గేయం కింద మారే కిన్నెర ఆయనలోని ఈ ఆత్మాంశ (Personality) వల్ల పుట్టి, నడకలు నడిచి, నాట్యం చేసి, సముద్రుడంత వాణ్ణి తనకోసం నవసిపోయేటట్లు చేసి, గోదావరి తల్లి గర్భంలో తలదాచుకుంటుంది. కోకిలమ్మ విషయమూ ఇంతే. పటుత్వం గల పెంపకంలో ఈయన ప్రజ్ఞ కిన్నెరసాని రూపచిత్రణము రససౌందర్యాల రమణీయతను పొంది కవి సృష్టి శిల్పానికి విశిష్టత చేకూర్చింది. కిన్నెర 'ఉద్విగ్న హృదయ' పతివ్రత, అత్తపోరు పడలేక అడవులపాలై కరిగి నీరై, నాగై ప్రవహిస్తుంది. ఆవేశహృదయంతో ఆమె చేసిన తప్పిదానికి పశ్చాత్తాప పడుతుంది. ఇంట్లోనుంచి ఏ


సాహిత్య విమర్శ

495