"ఎద మెత్తనౌటకై
గద అంత
మందిలో అహమ్మెల్ల
వదలి పోవునురా!”
అని ఆయన ప్రవచనము.
"ప్రేమించు ప్రేమకై
ప్రేమించు ముక్తికై
ప్రేమించు ప్రేమకై”
అన్న మాటలలోని మొదటి స్వార్థపరత్వమూ, చివరకు తద్రాహిత్యము కవిప్రేమ సిద్దాంత పరిణామాన్ని సూచిస్తున్నది.
ఆయన వ్రాసిన కొన్ని జాతీయగీతాలు, దేశీయ గీతాలు కూడా ఉన్నవి. ఆయన దేశభక్తి గురజాడ కవివలే యావద్భారతానికీ సంబంధించింది. రాజకీయంలో కాంగ్రెసు వాది, విశ్వశ్రేయస్సు ఆకాంక్షించి, విమల భావాలు దేశానికి నూరిపోసి ప్రజాదరాన్ని పొందుతూ ఉన్న ఈ కవి కలకాలం నిలిచేవాడు.
జానపద భాషను, వాతావరణాన్ని అవలంబంగా పెట్టుకొని ఆత్మానుభవాలను జానపద గీతాలుగా కృషి చేసిన అమరకవి నండూరి. జానపదాల వ్యవహారంలో ఉన్న కొంచెం భాషతోనే కమనీయ కావ్యమే కాదు కదా, శాస్త్రార్థాలు గూడా అందుకోలేని అతిలోక విషయాలను రూపించాడీ కవి. ఇదే ఆయన ఉపజ్ఞ. కవులము కావాలని ఉబలాటపడేవారికి మొదట వీరి మార్గం కొంత సులభంగా కనిపించినా, అనుభవంలో పునీతమైన సంస్కారం వినా దుస్సాధ్యంగా తేలిపోయింది. వీరి యెంకిపాటలలో కమ్మని సంగీతము, సహజమైన పవిత్ర భావనలు, ఉక్తి సౌలభ్యము ముఖ్యంగా హృదయా కర్షణశక్తి కనిపిస్తవి. ఈ పద్ధతికి వీరే మార్గదర్శకులు. ఎంతమంది ఆ విధంగా వ్రాయటానికి ప్రయత్నాలు చేసినా ఏదో లోపం కలుగుతునే ఉన్నది.
గేయ కవితాలోకంలో పాత్రసృష్టి చేసిన కవులు బహుకొద్దిమంది. నండూరి యెంకి కవికీ, తనకూ విశిష్టత గడించింది. "పూలమొక్కల నీటిజాలు గని నిలుసుండి పూలన్నీ నీపాటే ఆలించె" అనే సునిశిత భావనాబలము, "అందాలు చూచుకోటానికి అద్దాలెందుకు? కనుపాపలు లేవా” అనే సహజరసికత, 'యెనక జల్మంలోన ఎవరమో?' అని నాయుడు బావ అన్నప్పటికీ ముగ్ధత్వమూ, “ముందు మనకేజల్మ ముందో లె”
492
వావిలాల సోమయాజులు సాహిత్యం-4