హృదయానికి తాకుతవి. చిన్న పిల్లలకోసం వ్రాసిన “పూర్ణమ్మ పాట” మొదలైన గేయాలలో చిక్కనైన తేటతెనుగు తొణికిస లాడుతుంది. వీరి ఎత్తుబడులు ఎంతో మనోహరంగా ఉంటవి. దేశభక్తి అంటే,
"దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయి
గట్టిమేల్ తలపెట్టవోయ్"
స్వంతలాభం కొంత మానుకు
పొరుగువారికి తోడు పడవోయ్
దేశ మంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్!"
అని ఆంధ్రదేశంలో ప్రథమ శంఖధ్వానం చేసిన కవితాత్వికుడు (Poet - Thinker) నాటకరచయిత, ప్రథమ కథకుడు, విమర్శకుడు, నవ్య సాహిత్యానికి మూల పీఠము. ఒకవిధంగా రచనలు ఎక్కువభాగం వాచ్యంగా ఉండడం వల్ల కవితాశిల్పము కొంతవరకు లోపించిందేమో అని అనిపిస్తుంది. భాషావిషయంలో గురజాడ కవిని అనుకరించటానికి బసవరాజు ప్రయత్నించాడు. కానీ వారిని వీరందలేదని ఒక మతము. ఇది విచారణీయాంశము.
బసవరాజు నిరంతరమూ గానం చేసిన కవికోకిల. పాట కోసమే తన జీవితము మీదు కట్టాడు. ఆయన జీవితాశయమే అది. కవి -
“పాట పాడుతుండగ నా
ప్రాణి దాటి ఏగేనా
ప్రాణి దాటి ఏగుతుండ
పాట నోట మోగేనా" - అనే గేయంలో
ఆ విషయాన్నే సూచించాడు. “కావ్యమె జీవంగా గడపిన కవి.” “కావ్యపానం చేసి కైపెక్కి" తన ఆత్మశక్తిని గుర్తించాడు.
"గుండు రా రా మంచు
కొట్టినట్టుగ నేటి
490
వావిలాల సోమయాజులు సాహిత్యం-4