ఆధునిక కవులు కొందరు వాస్తవిక ప్రపంచానికి దూరమైపోయినారు, కల్పిత లోకాల్లో దారి తెలియక తారుమారై పోతున్నారు. కేవల భావనాజగత్తులలో కవులు విహరించడం వల్ల లోకజ్ఞత, వాస్తవ జగత్తులోని జీవిత విమర్శ (Criticism of life) అడుగంటినవి. వస్తు వైవిధ్యము సన్నగిల్లిపోతున్నది. కవి వాస్తవ జగత్తులోని వస్తువును చేపట్టి అన్యానుభూతిని యథాతథంగా ప్రదర్శించక, స్వాయత్తం చేసికొని వస్తుతత్త్వం చెడకుండా కొన్ని నూతనాంశాలను భావించి చేర్చుకొని కావ్యరచన చేస్తాడు. వాస్తవ లోకాన్ని వదిలి కేవల భావనాప్రౌఢ వీధుల్లో విహారం చేసే కవి నేల విడిచి సాము చేసే వాడన్నమాట. వివిధరకాలైన గేయాలు విరివిగా రాకపోవటము, ఉన్నవాటిలో వైవిధ్యము లేకపోవటమూ చాలామటుకు పై కారణం వల్లనే.
నూతనత్వం మీద అత్యధికమైన ఆకాంక్ష పెట్టుకొని కొందరు గేయరచయితలు అర్థపుష్టి, అన్వయసౌలభ్యాలను నీట కలుపుతున్నారు. నూతనసృష్టి మీద దృష్టి ఉండవలసిందే. “కాని నూతనత్వ మనేది భాషానియమోల్లంఘనాల వల్ల సిద్ధించదు. కవి సమయాలు పాటిస్తే నూతనత్వానికి భంగం రాదు. అర్థపుష్టి. అన్వయ సౌలభ్యమూ మొదలైన గుణాలు లేకపోతే నూతనత్వానికి కాదుగదా, కవితకే భంగం కలుగుతుంది. భావాలు నూతనంగా ఉండవచ్చు. పద సంఘటనలు క్రొత్త తీరుగా కూర్చవచ్చు. నూతనత్వం కోసం అర్థము పాడయ్యేటట్లు కూర్చటంలో నూతనత్వం లేదు.”
సంప్రదాయానికి ఇమడని అన్యసారస్వతాలలోని మెలకువలను అనుక రించటంవల్ల, కొన్ని కొన్ని గేయాలు విచిత్ర రూపాన్ని ధరించాయి. ఆ విచిత్ర రూపం కూడా ఒక సౌందర్యమనే కొందరి సమర్థన.
ఆధునిక గేయ రచయితలలో ప్రత్యేకత కలిగి ప్రసిద్ధి పొందిన కొందరి రచనా పద్ధతులు, కవితావస్తువులు, ప్రత్యేకతలు చూపించవలసిన బాధ్యత కొంత ఉన్నది. గురజాడ అప్పారాయకవి నేటి గేయకవితాపితామహుడు, నీతి, దేశభక్తి, అస్పృశ్యత, పాశ్చాత్య వ్యామోహాది సంఘసంస్కరణము వీరి వస్తువు. వీరి దేశభక్తి యావద్భారతాన్నీ అనుసరించింది గాని, కేవలమూ ఆంధ్రదేశాన్ని మాత్రమే అంటిపెట్టుకొని కూర్చున్నది కాదు. కొద్ది మాటలలో పెద్ద భావాన్ని ఇమడ్చడము, రచన రససిద్ధిని పొందిగాని చేయకపోవటమూ వీరి ప్రత్యేకశక్తులు. ప్రజాదరణ పొందిన ముత్యాల సరాన్ని “పార్శీగజల్ వరుస” లో మొదట యీ కవి ప్రవేశపెట్టాడు. ఎంతో కాలము పరిశ్రమ చేస్తేనేగాని వీరు గేయాలలో వాడిన కండగల జాతీయ జీవద్భాష చేత చిక్కదు. అటువంటి భాష ఉపయోగించడము వల్లనే ఆయన భావాలు సూటిగా వచ్చి
సాహిత్య విమర్శ
489