పెట్టుకోవటము మంచిది. పిల్లలకు వ్రాసే గేయాల్లో అందుకోరాని సౌందర్యోపాసన, నాస్తికత ఇత్యాది శూన్య సిద్ధాంతాల కన్నా అహింస, ధార్మికత, ప్రేమ, సత్యము, నిరాడంబరత్వము, భక్తి మొదలైన విశ్వశ్రేయ విషయాలు వస్తువులుగా తీసుకొని, కొద్దిపాటి వ్యంగ్యంతో చిత్రించి చూపడము మంచిది. ప్రకృతిలోని విచిత్రాలను చూపిస్తూ వాటితో పిల్లలకు విజ్ఞానాభివృద్ధి కలిగేటట్లు చేయటము ఈ శ్రేణికవులకు ఆశయమైతే బాగుంటుంది. వయసుమీరిన బాలబాలికలకే ఈ గేయరచనా పద్ధతులు నేర్పి వారిచేతనే ఈ రచనలను పెంపొందజేయటము సమంజసమే.
సాంఘిక గేయరచయితలు కొద్దిమంది ఛందోబంధాలను త్రెంచి వేయకుండా, దేశీయమైన సంఘ దురాచారాలను ఎత్తిచూపుతూ మానవ హృదయంలో కరుణకు స్థానం కల్పిస్తున్నారు. ఈ గీతాలు విరివిగా రావలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రస్తుత ప్రచారక గేయాల్లో కవితావస్తువు బొత్తుగా లేనే లేదు. దీనికి మూలకారణము వ్రాసినవాళ్లు కవులు కాకపోవటమే. ఛందో విషయంలో అనవధానత ఎక్కువ, ప్రచారక గేయాలు ఎంత ఛందోబద్దంగా ఉంటే సంగీతోత్పత్తి అంతగా కలిగి, ప్రచారోద్దేశ్యము అంత గాఢంగా ప్రజాహృదయంలో నాటుకు పోవటానికి అవకాశం కలుగుతుంది. ఇటువంటి రచనలను కూడా కవులు చేపట్టి రసవంతంగా చేస్తారని నమ్ముతున్నాను.
ఆధునిక విప్లవగీతాలు శైలి వస్తువులు రెంటిలోనూ అన్యసారస్వత వాసన పరిమళిస్తున్నది. వీటిలో కొన్నిటికి అనుకరణలమీద అనుకరణలు బయలుదేరాయి. “అన్నమయ కోశాన్ని” అంటిపెట్టుకొన్న ఈ శ్రేణికవులకు భావి, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులమీద దృష్టి తక్కువేమో. కేవలం ఆదర్శాలే గాని, నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్లు కనపడవు. సర్వమానవ సౌభ్రాతృత్వము, విశ్వ శ్రేయస్సు కోరే ఈ కవుల రచనలు చాలాభాగం అందరికీ అందుబాటులో ఉండవలసినది పోగా, సాహితీ విమర్శకులకు కూడ కొన్నిచోట్ల అవగతం కాకుండా ఉంటున్నవి. ఈ రచయితలలోని ఉత్సాహము, ఉద్రేకము, విప్లవతత్త్వము మెచ్చుకోదగ్గవి. వారి రచనలను గ్రహించడానికి ఇంకా కాలం పడుతుందని కొందరి సమాధానము. అలా అయితే వారు తేదలచుకున్న విప్లవం గూడా దానితోపాటు వెనక్కు పోతుందనే విషయం గూడా గ్రహించాల్సి ఉంటుంది.
వ్యక్తిగతంగా కాకుండా నేటి గేయసాహిత్యాన్ని పరిశీలిస్తే మంచిచెడ్డలు రెండూ గోచరిస్తవి. ఆధునికుల అపార శ్రమవల్ల ఈ రచనలకు మిగిలిన కవితావిభాగాలతో
సాహిత్య విమర్శ
487