గేయకవితా ఛందస్సులను నవ్యకవిత్వం పుట్టకముందూ, పుట్టేరోజుల్లో యక్షగాన నాటకాల్లో విరివిగా వాడుకజేసేవారు. మిగిలిన అనేకంతో పాటు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేవిగాని, వాటికి ప్రత్యేక స్థితి లేదు. ఆ యక్షగానాల పేరు గానాలైనా, వాటిలో అన్ని గేయఛందస్సు లుండవు. క్షేత్రయ్య, త్యాగయ్య మొదలైన వాగ్గేయకారుల కృతులలో అన్నీ గేయఛందస్సులే అయినప్పటికీ వాటిలో కవితాగుణము తక్కువే అని ఒప్పుకొని తీరాలి. యక్షగానాల విషయం గూడా ఇంతే! అవి కేవలమూ సంగీత దృష్టితో పల్లవి, అనుపల్లవులు కల్పించి వ్రాసిన “కృతులు”.
ఆ కారణం చేతనే వాటిలో సంగీత సాహిత్యాల ఎక్కువతక్కువలు కనిపిస్తవి. ఈ గేయఛందస్సులకు సంగీత సాహిత్యాల సమరత్వము నవకవుల వల్ల ఏర్పడ్డదే. నేటి కవుల గేయం పాశ్చాత్యుల గేయ లక్షణానికి అనుగుణంగా ఉంటున్నది. "సంగీత సాహిత్యాల సంయోగం వల్ల ఏర్పడి, ఏకభావాశ్రయమై, ఆలాపన కనుయుక్తమైన లయతో కూడిన ఆత్మకావ్యము గేయమని వాని నిర్వచనము. '
"As a Union of Poetry and music, it (Song)
may be defined as a brief Lyrical poem...
.... to which is added a melody for the
purpose of singing it”
స్థూలంగా గేయాలను పాశ్చాత్యులు రెండు రకాల క్రింద విభజించారు. 1. కావ్యశిల్ప గీతాలు (Art Songs), 2. జానపదగీతాలు (Folk Songs). సుఖదుఃఖాది అనుభూతులు కలిగినప్పుడు సూటిగా పల్లీయజనుల హృదయకుహరాలను బ్రద్దలు చేసుకొని బయటపడేవి జానపదగీతాలు. సంస్కృతిరహితులైన జానపదులు వాటి కవులు. సహజమైన ఆవేశము కొన్ని కట్టుబాట్లకు లోనై కవి శిల్పి చేతిలో చిత్రణము పొందేవి రెండోరకము. ప్రజాసాహిత్యం మీది ఆకాంక్షవల్ల నేటి రచయితలు గేయఛందస్సులను విరివిగా ప్రయుక్తం చేసి రకరకాలుగా రచనలు సాగిస్తున్నారు. సింహావలోకనంచేస్తే చివరకు క్రిందివిధముగా విభజన చేయవచ్చు ననిపిస్తుంది. కథాగమన గీతికలు (Narrative Songs), గీతినాటికలు (Song - Dramas), గోగీతికలు (Pastoral Songs), జాతీయ గీతాలు (National Songs), జానపద గీతాలు (Folk Songs), సాంఘిక గేయాలు (Social Songs), ఆత్మ గీతాలు (Personal Songs), ప్రేమ గీతాలు (Love-Songs), ఆధ్యాత్మిక భక్తిగీతాలు (Philosophical and devotional
484
వావిలాల సోమయాజులు సాహిత్యం-4