లమ్ము కప్పురమందు నెప్పుడు
నిమ్ములను మీరున్.”
కృతియోగ్యానుసారంగా నూతన ఛందస్సులను ఆధునికులు కల్పించుకుంటే మాత్రము ఏమి మునిగిపోతుంది?
పురాతన ఛందస్సంప్రదాయానుసారంగా గేయకృతులను రచించినా, ఈ నాటి పదకర్తల మీద, వారి రచనల మీద అకారణంగా నిరసన భావము చూపిస్తున్నారు. అటువంటి వారికి ప్రాకృతకవితపట్ల ఆ నాటి సాంస్కృతికుల మనుకొనేవారు అసహనము చూపించినప్పుడు, జయవల్లభుడు చెప్పిన సమాధానము ఒప్పజెప్పడము సమంజసము.
ప్రాకృత కావ్యం పఠితుం గుంఫితుం
తథా చ కుటజ ప్రసూనం కుపితాం చ
ప్రసాదయితుం అద్యాపి బహవో న జానంతి
ప్రాకృతకావ్యం చదవటం గాని, వ్రాయటం గాని, కుటజ ప్రసూనమాలిక కూర్చడము, కుపితురాలైన ప్రియురాలిని ప్రసన్నను చేసుకోవటము మీకు తెలియవు.
ఆధునికులు
"The nightingale thought
I have sung songs but never a one so gay
For the sings of what the world be
When the year have died away"
నవ్యసాహిత్యం పుట్టీపుట్టకముందే అర్వాచీనుల దృష్టి గేయఛందస్సుల మీదికి ప్రసరించింది. సాహిత్య ప్రపంచంమీద విప్లవం చేసి నూతన కవితారీతులు ప్రవేశ పెట్టదలచుకున్న అన్ని దేశాలలోని కవులూ, తమతమ ప్రజాసారస్వతంలోని పదఛందస్సులలో కవిత్వం చెపుతారు. ఆంగ్ల సారస్వతంలో పోపుడ్రైడనుల కవితాపద్ధతుల మీద తిరుగుబాటు చేసి నూతన సంప్రదాయములను, కవితా వస్తువును కొనివచ్చిన రొమాంటిక్ కవుల విషయంలో అంతే జరిగింది. వారు మరుగు పడిపోయిన పూర్వపద ఛందస్సులను ఎన్నిటినో పునరుద్ధరించారు. మన వారు చేసిన పనీ అంతే. మరుగుపడి పోవడమంటే మహాకవులు వాటిని చేపట్టకపోవటమన్నమాట.
సాహిత్య విమర్శ
483