తరితీపుసేయు సమసురతిబడలికతోను
జరతపాపడ చెరగు జార్బైటతోను
ఇరుగడల కైదండ లిచ్చు తరుణులతోను
పరమాత్మ, మువ్వగోపాల తెల్లవారె ననుచు
॥ మగువ ॥
భావకవిత్వమేదో ఈతనితో పుట్టినట్లుందే? స్త్రీల సారస్వతములో ఇది ఉన్నది, ఇది లేదనటానికి వీలులేదు. సర్వశాస్త్రాలు, పురాణాలు, ఉపాఖ్యానాలు, ప్రాచీనులు ప్రత్యేకంగా స్త్రీలకోసం పదాలుగా రచన చేశారు. కుసలాయకము, కుచ్చెలకథలు, సీతసురటి, గంగాగౌరీ సంవాదము; లంకాయాగం, లక్ష్మణ దేవరనవ్వు - కోవెల రాయబారము, చిలుక రాయబారము - ఎన్నో పాటల పుస్తకాలు ముద్రితమై ఉన్నాయి. వీటిని గురించి వ్రాయడం ప్రత్యేకంగా పెట్టుకోవలసిన పని.
పదకర్తలకు ఉపకరించే ఛందస్సులు తరువోజ, రగడలు, ద్విపదలు, మంజరులు, ముత్యాల సరాలు, మధ్యాక్కరలు మొదలైన జాతీయఛందస్సులు. అంతమాత్రంతోటే కొన్ని కృతులు వృత్తాలుగా ఉండవనటానికి వీలు లేదు.
'చింతచెట్టు చిగురు చూడు
చిన్నదాని షోకు చూడు'
అనే పదాన్ని విభజిస్తే సుగంధివృత్తమౌతుంది. ఇవన్నీ ఇంచుమించు మాత్రాఛందస్సులు, గురజాడ అప్పారావుగారు చేపట్టిన నాటినుండీ వీటికి మళ్ళా ప్రాణప్రతిష్ఠ కలిగింది. ఆధునికులు నూతన ఛందస్సులను సృష్టి చేసి కావ్యరచన చేస్తున్నారనే అభిప్రాయం ప్రబలింది. కాని అది అపోహ. అన్నీ పూర్వకవి ప్రయుక్తాలే. ముత్యాల సరమనే పేరు క్రొత్తదైనా ఆ ఛందస్సు పూర్వ సాహిత్య ప్రసిద్ధమే. గోకులపాటి కూర్మనాథకవి మృత్యుంజయ యక్షగానంలో హిమవన్నగాన్ని వర్ణిస్తూ ఇదే ఛందస్సు ఉపయోగించాడు చూడండి.
'సాలతాల తమాలతిలక ర
సాలకురవక కుందవిచికిల
మాలతీసుమ ఫలము లందున
జాలగా నమరున్.
కమ్ము కస్తురి కల్కి తావుల
గ్రమ్ము జవ్వాజి యను తుహిన జ
482
వావిలాల సోమయాజులు సాహిత్యం-4