Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"జాతర జాతర జాతర సుమ్మీ
జాతరతీతుడు వేమన సుమ్మీ
వేదాతీతుడు వేమన సుమ్మీ
వేమన చెప్పిన వేదము సుమ్మీ
వేదశాస్త్రములు వాదులు సుమ్మీ
వాదుల నోళ్ళకు బూదిడు సుమ్మీ
కన్నవారు మరి చెప్పరు సుమ్మీ
చెప్పిన నెవ్వరు చేయరు సుమ్మీ
చేసినవారే సిద్దులు సుమ్మీ
సిద్ధులమాట ప్రసిద్ధము సుమ్మీ”


అనే గేయంలో ఉదోషించాడు. బాపనయ్య, నందమయ్య, వీరబ్రహ్మ యోగి మొదలైన జనసామాన్య వేదాంతుల రచనలన్నీ ఎంతో తీపిగా ఉంటాయి. ఇంత వరకూ ఈ గీతాలకు బైరాగుల నోళ్ళలోనే నివాసం.

'పంచదశి' సారాన్ని అంత చిన్న ఉయ్యాలపదంలో పెట్టిన బాపనయ్య -

'ఓం నమశ్శివాయ ఆరక్షరముల తొట్టి
ఆరంభమాయెనే ఉయ్యాలా ॥
రక్షకుడు చిన్మయా తొట్టిలోపల తాను
ఊగుతూ ఉన్నాడు ఉయ్యాలా ॥'

అనే ఉయ్యెలపదం పూర్వసువాసినులు పాడుతూ ఉంటే, ఎందుకో మన ఒళ్ళు పులకరిస్తుంది. ఇటువంటిదే

తొలుత బ్రహ్మాండంబు
తొట్టి గావించీ
నాలుగూ వేదములు
గొలుసు లమరించీ ॥

||జో అచ్యుతా||

అనే వేదాంత ప్రతిపాదక పదము.

ఈ శ్రేణికి చేరిన తోట నరసింహదాసు వేదాంతి రామదాసు శతకములో ఛందస్సులో క్రొత్తకల్పన చేశాడు చూడండి.


సాహిత్య విమర్శ

479