జానపదులకు కవిత కష్టాలకూ వస్తుంది, సుఖాలకు వస్తుంది. ప్రవాస దుఃఖము అనుభవిస్తూ ఉన్న పల్లెపడుచు ఏరురావాలనీ, వస్తే బావ వచ్చి లాలిస్తాడని తొలకరినుంచే వెర్రితలపులు తలచుకుంటూ పాట పాడుకుంటుంది.
'తొలకరి ఒక మబ్బు తొంగి చూచింది
మబ్బులో ఒక మెరుపు మెరసిపోయింది
పెరటిలో ఒక జల్లు కురిసి వెలిసింది.
జల్లులో నా మనసు జారిపోయింది
ఏ కొమ్మ మీదనో ఎండ తాకిన పిట్ట
ఏటి త్రోవలు పట్టి ఎగిరిపోయింది
ఏరువాక నాటి కేడాది దాటింది
ఎదురు చూచి గుండె చెదిరిపోయింది
పిట్ట పిట్టా ముద్దు పెట్టుకున్నాయి
గోవులన్నీ ఇల్లు చేరుకున్నాయి
ఏటిగాలికి చిలుక లెగిరిపోయాయి
ఎందుకో నా ఆశ లెగిరిపోయాయి
ఏటి ఒడ్డున నేను పాట పాడేవేళ
నవ్వుతూ మా బావ పువ్వులేరేవేళ
కొంటె కోయిలపైన కూతకూ సేవేళ
లేతమనసులు విచ్చి పూత పూసేవేళ
బావొచ్చి నాతోటి బాసలాడాలి
ముద్దోచ్చి నాతోటి మురిసిపోవాలి
ఏరువాకమ్మ మా కెదురు రావాలి
తలవంచి మము చూచి దీవించి పోవాలి'
ఎంత ప్రకృతి సిద్ధ భావౌన్నత్యము! సౌకుమార్యం! ఇటువంటి పల్లిజన ప్రేమ “వెంకయ్య - చంద్రమ్మ” పాటలో ప్రదర్శితమౌతుంది.
'తెలిచందమామలో తియ్యపానకముంది
తెచ్చి పెడుదువు గాని రారో రెంకయ్య!'
అన్నప్పుడు చంద్రమ్మ అమాయకత్వమూ,
476
వావిలాల సోమయాజులు సాహిత్యం-4