'వల్లకి చక్కి కాహళము
వంశము డక్క హుడుక్కు ఝఝురుల్
ఝల్లరి యాదిగా గలుగు
శబ్దపరంపర తాళశబ్దమై
యుల్లసిలం బ్రబంధముల
నొప్పుగ నాడుదు రుగ్రవేది పైఁ
బల్లవపాణు లీశ్వరుని
పంటమహీశులు పూజసేయగన్'
అని వర్ణిస్తాడు. అటువంటి శ్రీనాథుడేమిటి, పదసారస్వతాన్ని పరిహసించటము ఏమిటి?
దిగ్విజయార్థము బయలు దేరుదామనుకున్న కృష్ణరాయలకు అపరిమితోత్తేజము కలిగించిన ఆ నాటి జానపదుని-
కొండవీడు మనదేరా!
కొండపల్లి మనదేరా!
కాదను వాడుంటే
కటకం దాకా మనదేరా!
అనే గేయం ఆంధ్రలోకానికి అపరిచితం కాదు. ప్రబంధ యుగంలో ప్రత్యేక గేయరచనలు వెనుకపడ్డా, పుష్పాపచయాలలో పద ఛందస్సులు కనిపిస్తున్నాయి. ప్రబంధ నాయికలకు పదసారస్వత మంటే పరమానందము కూడాను.
నాయకరాజుల పరిపాలనకాలంలో మళ్ళా పదకర్తలు తల ఎత్తారు. పద్య కవులతో సమాన గౌరవం లభించింది. ఎన్నో యక్షగానాలు ఉద్భవించినవి. రంగాజీ, రామభద్రాంబ, కృష్ణాజీ మొదలైన కవయిత్రులు పదరచనల్లో పాల్గొన్నారు. విజయరాఘవ నాయకుడు క్షేత్రయ్య, తదితర వాగ్గేయకారాగ్రగణ్యులను పోషించటమే కాకుండా, ఎన్నో చౌపదులు, ద్విపదలు, యక్షగానములు రచించాడు. ఈతని కాలినడకలనే అనుసరించి మహారాష్ట్ర నాయకులలో ప్రముఖులైన శాహజీ ప్రభృతులు పదసారస్వతసేవ చేశారు. ప్రబంధయుగంలో పదరచనలు చేయటానికి దడిచినట్లు పండితకవులు పోయిన రెండు శతాబ్దులలో వెనుదీయలేదు. ఎలకూచి బాలసరస్వతి, కంకంటి పాపరాజు,
474
వావిలాల సోమయాజులు సాహిత్యం-4