'వీణాగానం వెన్నెలతేట
రాణమీరగా రమణుల పాట
పేరుచెప్పిన పినబ్రాహ్మణు వీట
జాణలు మెత్తురు జాజరపాట'
అనేది. జాజర అనేది ఏదైనా వాద్యవిశేషమా? లేక పదభేదమా?
కవిసార్వభౌముడు శ్రీనాథుని జీవితకాలానికి పదఛందస్సులను కావ్యార్హత ప్రస్పుటమైనది. ద్విపదలో సోమన రచనలు అంతకుపూర్వమే ఉన్నా, అవి మతవిషయిక పురాణాలు కాని రసవత్కావ్యాలు కావు. ఈ యుగంలోనే శ్రీనాథుని పల్నాటి వీరచరిత్ర, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానము, నవనాథ చరిత్ర ద్విపదలు. శ్రీనాథుడు పదకవిత్వాన్ని
'ముదివిటులు వెధవలంజలు
పదకవితలు (?) మాఱు బాపన వార
ల్చదువని పండితవర్యులు
కదనాస్థిర వీరవరులు కడిదిపురమునన్"
అనే పద్యంలో పలుచగా చూచాడని అంటారు. హాస్యరస ప్రధానమైన మోటు చమత్కారాలు. మొరటుతిట్లు నెత్తిన వేయించుకోవటానికి తెలుగు సారస్వతంలో తెనాలి రామలింగడు, శ్రీనాథుడు, ఏ అన్నెం పున్నెం ఎరక్కపోయినా, అసభ్య రసిక లోకానికి చిక్కుతారు.అతడు గేయరచనలు నిజంగా నిరసించినట్లైతే ఆ దేశీయ ఛందస్సులో పల్నాటి వీరచరిత్రను ఎందుకు వ్రాస్తాడు? శ్రీనాథునికి పదకవితలంటే ఎంతో ఇష్టం అనటానికి ప్రబలప్రమాణాలు ఇంకా ఉన్నాయి. భీమఖండంలో దక్షారామాన్ని వర్ణిస్తూ
'కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు
గాంధర్వమున యక్షగాన సరణి'
అని జనసామాన్య గేయ ప్రబంధాకృతిని ఉల్లేఖిస్తాడు. ఇతని పోషకులైన రెడ్డి రాజన్యులకు మహేశ్వరునికి వసంతాభిషేకము చేయటము అలవాటు. ఆ సమయంలో స్త్రీలు వల్లకి, చక్కి, కాహళము, వంశము, డక్క, హుడుక్కు, ఝల్లరి మొదలైన వాద్యవిశేషాలతో పదాలు పాడుతూ నర్తనం చేసేవారని భీమఖండంలోనే -
సాహిత్య విమర్శ
473