ఈ కాలంలో పద్యకవిత్వము కనిపించటం లేదు. సోమనకు పూర్వమున్న గేయ కవితాస్వరూపము మనకు బసవపురాణములోని -
'కర మర్థి నూరూర సిరియాళ చరిత
పాటలుగా గట్టి పాడెడువారు
అటుగాక సాంగభాషాంగ క్రియాంగ
పటునాటకంబులు నటియించువారు'
అనీ, పండితారాధ్య చరిత్రలోని శ్రీశైల వర్ణన సందర్భములో -
'మది నుబ్బి సంసార మాయాస్తవంబు
పదములు, పర్వతపదము లానంద
పదములు, శంకర పదముల్ నివాళి
పదములు, వాలేశుపదములు, గొబ్బి
పదములు, వెన్నెల పదములు, సెజ్జ
వర్ణన మణిగణ వర్ణన పదము
లర్ణవ ఘోషణ ఘూర్ణిల్లుచుండ'
భక్తులు శ్రీశైల పర్వతారోహణ చేశారని చెప్పే రెండు ద్విపదలవల్లా తెలుస్తుంది. తెలుగులో దేశీయ నాటకములు కూడా ఈ రోజులలోనే సదస్సును సంతోషపరచి ఉంటవి.
పదకవితల ప్రభావము తరువాత కవులమీద చాలమట్టుకు కనిపిస్తుంది. మొదట సంప్రదాయాలు కాని ఛందస్సులను - రగడలు, షట్పదులు, చౌపదులు, ద్విపదలు, పురాణ ప్రబంధ కవులు ఆమోదించి కృతియోగ్యాలుగా స్వీకరించారు. జాను తెనుగు ప్రభావ ప్రవాహానికి ఎదురీదటానికి నన్నెచోడ తిక్కనలు గూడా సాహసించలేదు.
వీరశైవ మత విజృంభణము నెమ్మదిగా వెనుకదారిపట్టి, హరిహరనాథాత్మకమైన అద్వైత సిద్ధాంతము మీదికి దేశంలో అభిమానం ప్రబలింది కొంతకాలానికి. అప్పుడు నాచన సోముడు ఉత్తర హరివంశమే కాకుండా, 'వసంత విలాసమనే గోష్ఠీ విషయక ఏకాశ్వాస ప్రబంధము రచన చేశాడు. తెలుగు తోటలో ఉపలబ్ధ మౌతూ ఉన్న ప్రథమ గేయసుమము మనకు ఆ కావ్యంలో కనిపిస్తుంది. అది
472
వావిలాల సోమయాజులు సాహిత్యం-4