Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/468

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెక్కు సామెతలను సందర్భోచితముగ, కులవర్గ పక్షపాతరహిత దృష్టితో శ్రీ దాసుగారు ఆదరించి ప్రయోగించినారు.

శ్రీ దాసుగారు బహుభాషా కోవిదులు. నేర్చిన భాషలన్నింటను వాని యందలి జాతీయ ప్రయోగ నైపుణ్యమును పుణికి పుచ్చుకొన్నవారు. చిన్ననాడే “All his love - in him” ను తరగతియందలి విద్యార్థులందరును పూరింపజాలనపుడు, “Centred" అని చెప్పి "that is very learned” అని ఆచార్యుని మెప్పుగొన్నవారు. అట్టి దాసుగారు “నా యెఱుక” యందు దేశీయములను, జాతీయములను కోకొల్లలుగ ప్రయోగించి, తమ రచనకు నిత్య తారుణ్యమును సంపాదించినారు. ఇందుకు "భరద్వాజవిందు, శృంగభంగము, కాష్ఠవాదము, కంకోష్ఠు పద్యము, శశవిషాణము, గగన కుసుమము, తిక్క శంకరయ్య, దాపుమూపు లెఱుగకపోవు, లెంపకాయ ఖర్చునకిచ్చు, వేలంవెట్టి గవ్వగ ఖర్చుపెట్టు, తొమ్మిదవ అర్థము పారాయణము చేయు, గురుడు పన్నెండింట నుండు, ఏకు మేకగు, బ్రహ్మానందమొందు" వంటి ప్రయోగములు కొన్ని నిదర్శనములు.

“నా యెఱుక" యందు శ్రీ దాసుగారు సహజత్వమును సంపాదించుటకై మాండలిక శబ్దములను బహుభాషలనుండి స్వీకరించిన శబ్ద జాలమును ప్రయోగించినారు. ఆంగ్ల భాషలనుండి వీరు "College, Magistrate, Scoundrel, thanks వంటి ప్రత్యేక పదములనే గాక "Vice-versa, Love fifty" వంటి పదబంధములను, "It lulled me to sleep" వంటి వాక్యములను సైతము గ్రహించి ప్రయోగించినారు. ఆంగ్లభాషాశబ్దములతో "కంట్రీగురుడు" వంటి సమాసపదములను కల్పించుటకును వీరు వెనుదీయలేదు. వీరి రచనయందు “సీదా, రస్తా, జరూరు, కరారు, కైజారు, ఉమ్మేజువారి, నిషాబాజు, కావేషీ, నిసీబు, తైనాతు, నాజూకు, సాహెబు, ఫర్మాయించు” మొదలైన ఉర్దూ, పర్షియన్, అరబిక్ పదములు “నా యెఱుక” యందు అనంతముగ ప్రయుక్తములైనవి.

శ్రీ దాసుగారు “తుంబ, తరవాణి, వంతర, వాణము (బండి), మొత్తములు, పల్ల, (చేతి) రువ్వ, మదిని (వదినె), పెయ్యమ్మ (పెత్తల్లి), తోచ్చి (పినతల్లి), ఆచ (అన్న), చిట్టి (పినతండ్రి), గోర్జెలు, లంకె, మప్పు, చీరె (వస్త్రము)” వంటి మాండలిక పదములను "బ్రహ్మ, పురోడాశము, ఇష్టి" వంటి వృత్తి మాండలిక పదములను; బాణమిచ్చు (ఐదు రూపాయలు సంభావన యిచ్చు) గురుడు (నల్లమందు, గంజాయి, బ్రాందీవంటి మద్యపదార్థము), గోవిందుడు (సారాయి సీసా), వంటి సాంకేతిక


468

వావిలాల సోమయాజులు సాహిత్యం-4