Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“ఉపమా కాళిదాసస్య” అన్నట్లు "ఉపమా ఆదిభట్టస్య" అన నొప్పుచు రసజ్ఞ లోకమును గిలిగింతలు పెట్టజాలియున్నవి. “చదువు కోటాకు వేసిన గురుజుపిట్టలా తిరుగుట; దైవమువలె కూర్చున్న బ్రహ్మ (యజ్ఞమును చేయించువారిలో ముఖ్యుడు); పుణ్యపుంజము వలె భర్త చెంగట నున్న సోమిదేవి; ధవళమేఘములవలె ప్రేలు ప్రత్తిచేలు; వేదహిత ధర్మముల మాడ్కి నొడ్డు చేర్చు నోడలు; వంగ మూడికవలె పిలక ఝాడించు; కామేశము పంతులు సవారిడేగ వలె వచ్చెను; (భార్య మరణానంతరము పునర్వివాహమాడుట) రాత్రిపడ్డ గోతిలో మరల పడినట్లు; డబ్బిచ్చి తద్దినము గొనినట్లు; వదలిన పీడను తిరిగి తెచ్చుకొన్నట్లు; పెండ్లిపిల్లలు బొడ్డు కోకతో నెండు రొయ్యవలె గన్పట్టిరి; నీరు మింటివఱ కుప్పొంగుటచే పండుగుల ముందు వెనుకల నున్న మనస్సువలె పడవ లాకున నున్నతమై పిదప మామూలు స్థితి వహించెను; పరపతి పోగొట్టు దబ్బరపల్కుల రీతి గాలిం గూడనీని తెఱచాపల ఛిద్రములు కేసు గెల్చుటకు వాదించు ప్లీడర్లవలె భోగేచ్ఛం బోరాడు వృషభంబులమాడ్కి నొండొరులు మీరి రాగ తానపల్లవుల బాడుచుంటిమి; సొరంగము నుండి రైలు బయటపడినపుడు కష్టముగడచినట్లు నిద్రమేల్కొన్నరీతి, రహస్యము నెఱిగినట్లు ననుభూతి నొందితిమి (భీముడు గారు తిరిగి మమ్మాదరించుటచే) క్రొత్త కుండలో జోరీగ చొచ్చినట్లైనది మా పని; వారింట భుజించి చెట్టువిడిచిన భూతమువలె తిరిగితిమి” ఇట్టివి వారి సహజసిద్ధములైన ఉపమలకు అల్పనిదర్శనములు. శ్రీ దాసుగారి బాల్యదశ బరంపుర మద్రాసుపయాణాది వర్ణనలకు చిత్రవిచిత్రములు, బహుసంఖ్యాకములు నైన ఉపమలు ప్రాణపదములు. శ్రీ దాసుగారు "రూపాజీవలు శ్మశానకుసుమముల వలె వర్ణనీయలు, పూలతావి మోసికొని వచ్చుటచేత సంతర్పణము తిన్న బ్రాహ్మణునివలె గాలులు మెల్లగ వీచుచున్నవి” - వంటి ఉపమలను పూర్వకవి గౌరవము వలనను, దేశాచారాభిమానము వలనను ఆదరింపకపోలేదు. పరిశీలింపగా ఔపమ్య, తర్క, న్యాయమూలాదులైన సర్వాలంకారములకు దాసుగారి “నా యెఱుక” యందు ఉదాహరణములు కన్పట్టకపోవు.

శ్రీ దాసుగారు ఆంధ్రజాతి సంస్కృతికి సుస్థిరసాక్ష్యములై యున్న సామెతల నెన్నింటినో "నా యెఱుక” యందు ప్రయోగించి, తమ రచనకు స్ఫూర్తిని చేకూర్చుకొనిరి. "నానాటికి తీసికట్లు నాగంభట్లు; జ్వరము తగిలి సందెకు దించినట్లు; దొంగిలింపబోయిన మంగలము దొరికినట్లు; దూదేకువారికి దుంపతెగులు; గ్రుద్దులాడుకొన్నగాని కులము బయటపడదు; చేయునవి మాఘస్నానములు దూరునవి దొమ్మరి గుడిసెలు; వినాయకుని చేయబోయిన; క్రోతియగు" - వంటి ప్రసిద్ధములైన


సాహిత్య విమర్శ

467