క్రిష్టియానిటీకి పెద్దప్ప; మహమ్మడానిజమునకు మేనత్త; లోకములో యోగులు, యోగినులు, హరిదాసులు, వేదాంతులు తఱచు సమయము తటస్థించువరకే ధూర్త బకములవలె ధ్యానమొనర్చెదరు. పిల్లి చాంద్రాయణమువలె కలికాలపు వైరాగ్యము నమ్మవాటము కాదు. త్రాగుబోతులందు మెట్టవేదాంతము క్షుద్రజనులలో దేవతావేశము తఱచుగ గోచరించును" - మొదలైనవి శ్రీ దాసుగారు మతములనుగూర్చి యొనర్చిన పరిశీలనలకు నిదర్శనములు. "తండ్రి వంక వారికంటే తల్లివంక వారెక్కువ ప్రేమింతురు. వెలబోటుల విశ్వాసము గగనారవిందము, పుణ్యాత్ములకు లాతివారి దోషములు కనిపింపవు. జూదము జరుగుతావున, తీర్థములందు, రైల్వే ప్లాటుఫారముల చెంత, వెలయాలియింటిలోను, మదిరాగృహములందు జనులకు త్యాగము మెండు. వ్యసనులు దయగల వారగుదురు. వ్యసనరహితు లెక్కడనో తప్ప గొడ్డువారివలె గార్హస్యదూరులవలె కఠినాత్ము లయ్యెదరు" - మానవ స్వభావాదులను గూర్చి శ్రీ దాసుగారొనర్చిన పరిశీలనలలో ఇవి కొన్ని.
"తీయని పాట యమకింకరులను గూడ కరిగించు" నని సంగీతశక్తిని ప్రశంసించుచు పరిశీలన మొనర్చినను, శ్రీ దాసుగారు సంగీతమునకు గల దుష్టశక్తిని గూర్చి "సంగీతము మరగినవారు నిషాబాజులవలె మరెందుకు పనికిరారు. తలను మణిగల ఫణికి విషాభివృద్ధి సహజమగునట్లు సంగీత విద్యగలవారికి దుష్టవర్తనము స్వభావ సిద్ధము. సంగీతము వచ్చినవారిలో నిర్మలవర్తను అరుదగుటచేతనే గదా గాయకులపాత్రులని స్మృతులు తెల్పుచున్నవి. కులస్త్రీలకు సంగీతవిద్య మప్పరాదు” అని నిస్సంశయముగ భావించిరి. “విశాఖపట్టణములో పురుషులకు నీరసము, స్త్రీలకు పుష్టి నైజము. అరవలకు ధనలోభము, మర్కట చేష్టలు, కాపట్యము, మురికితనము, మోటరికము సహజములు" - ఇట్లు శ్రీ దాసుగారు తాము వసించిన నగరములను గూర్చియు, పరిచయము కలిగిన ప్రజలను గూర్చియు అభిమానింపక, జంకక, 'నా యెఱుక' యందు కొన్ని పరిశీలన లొనర్చిరి.
“అనాదిగా నున్న వర్ణభేదమును తొలగించుట, స్త్రీ పునర్వివాహప్రేరణము చింత్యము" లని శ్రీ దాసుగారి పరిశీలన. స్త్రీలు "ఉస్కోయన" ఉస్కోయనునట్లు పురుషునితో సమానముగ వర్తింపరాదనియు వారు యథాపూర్వకముగ నుండుటయే మేలనియు, స్త్రీ గృహలక్ష్మీ రూపమున భర్త యోగక్షేమముల నరయుటయే ఎల్లలోకముల నుద్ధరించుట యనియు, తాత్పర్యమున 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' యనియు శ్రీ దాసుగారి పరిశీలనము. పురుషుడు మగయాడువాడు, స్త్రీ ఆడు మగది - అని నేటి
464
వావిలాల సోమయాజులు సాహిత్యం-4