Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేయుట 2. ప్రాబ్లము మెంటల్ గా సాల్వు చేయుట 3. నల్వురకు తెలుగున, నల్వురకు సంస్కృతమున కవిత్వము చెప్పుట. 4. వ్యస్తాక్షరి 5. న్యస్తాక్షరి 6. ఇంగ్లీషున కోరిన విషయముపై నుపన్యాసము 7. పూలు, గంటలు లెక్కించుట 8. ఛంద స్సంభాషణములతో గూడిన బందరు అష్టావధానము వంటి వానియందు శ్రీ దాసుగారు ప్రదర్శించిన ప్రజ్ఞకదియే సాటి. ఇవి అసాధ్యాష్టావధానములు. ఇట్టి విద్యా ప్రదర్శనములను తిలకించి పండిత ప్రకాండులు "ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా" అని ప్రశంసించుటలో ఆశ్చర్యమేమున్నది? శ్రీ నారాయణదాసుగారి స్వీయచరిత్రయైన “నా యెఱుక” వారి వ్యక్తిత్వమును సమగ్ర రూపమున ప్రదర్శించి, వారి జీవన్మూర్తిని పాఠకుల కనులకు కన్నట్టు నల్లొనర్చుటలో కడుశక్తిమంతమైనది.

6

“నా యెఱుక" యందు శ్రీ నారాయణదాసుగారు సందర్భోచితముగ 19వ శతాబ్ది చివరిపాదమందలి ఆంధ్రదేశస్థితిగతులను, ప్రజాజీవితమును ప్రదర్శించిరి. నాటి ప్రభువుల విద్యాపరీక్షణ కీర్తిప్రియత్వములను, ప్రజల అన్నదాన విద్యాదాన పోషణాదులను శ్రీ దాసుగారు వెల్లడించిరి. వైదిక విద్యార్థుల జీవితమును రుచి చూపించిరి. నాటి యజ్ఞ ప్రియులైన బ్రాహ్మణులు ఇష్టులు జరుపుకొనుచుండెడి వారు. నీటికరువు వచ్చినపుడు వారుణ జపములు చేయుట, గంగాష్టకము పఠించుచు బావులు త్రవ్వించుట, నృసింహజయంతి, ఏకాదశి మొదలైన పుణ్యదినములందు అభీష్ట దేవతామంత్రజపములు చేయుట వారి కాచారము. గుడుగుడు కుంచము. గుజ్జనగూళ్లవంటి ఆటలేకాక, కోతిపిఱ్ఱ, గోనెబిళ్ల, కిఱ్ఱు గానుగ వంటివి బాలుర క్రీడలు. ఆ నాడు నాచురంగు (వేశ్యల నాట్యప్రదర్శన) లను ప్రభువులు, ప్రజలు ఆదరించిరి. వేశ్యలు సంఘమునందు అంతర్భాగమై యున్నట్లును, విద్వాంసులకు అందు ముఖ్యముగ సంగీత విద్వాంసులకు, వారితో గాఢమైత్రి యున్నట్లు తెలియుచున్నది. విద్వాంసులు “గురుసేవ" (మద్యపదార్థ వినియోగము) యొనర్చెడి వారు. ఆంగ్లవిద్య క్రమక్రమముగా దేశమున పాదుకొనిపోవుచున్నది. శ్రీ నారాయణదాసుగారు మహీశూర రాష్ట్రమున స్త్రీలు పురుషులతో సమానస్వత్వములను వహించి విద్యాభ్యాస మొనర్చుటయును, స్వైరవిహారము లొనర్చుటయును గుర్తించిరి.

సంఘ గౌరవము ప్రభుత్వోద్యోగములను బట్టి కల్గుచుండెడిది. పంక్తి భోజనవేళల యందును గౌరవనిశ్రేణిక యీ క్రమముననే జమీందారీ ప్రాంతములందు


462

వావిలాల సోమయాజులు సాహిత్యం-4