Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సగర్వముగ జెప్పికొనినారు. శ్వవృత్తి గైకొన్నవారు ఎంతటి విద్యావంతులైనను స్వార్థపరులై తమ ప్రభువైన ఆనందగజపతిని అపమార్గములనుండి తప్పించి, దేశశ్రేయస్కరములైన సత్కార్యములకు ప్రోత్సహింపరని వీరు ఆక్రోశించినారు.

'భోగరాయుడ' నని పలుమారు ప్రకటించుకొన్న శ్రీ దాసుగారు శృంగార శేఖరులు. భోగలాలసులైనను వీరు పరస్త్రీని మాతృవతుగా దర్శించినవారు. నైజధర్మాభిరతిగల వీరిదృష్టిలో మిత్రులు ఉంపుడు కత్తెలును వీరికి ఆశింపదగనివారు. ఆప్తమిత్రులైన భీముడుగారిని ద్వితీయ వివాహమునకు ఉద్బోధించువేళ, వారికి పరమ పతివ్రతయని తమ వేశ్యపై గల భ్రాంతిని తొలగించుటకై, వారి అభ్యర్థనను గైకొనిగాని శోధించుటకు బూనుకొనకపోవుట ఇందుకు తార్కాణము. భోగినీజన చిత్తవృత్తిని గూర్చి శ్రీ దాసుగారికి గల పరిజ్ఞాన మపారము. వారకాంతలవలన నెంతటి సౌఖ్య మనుభవించినను వీరు తార్తీయపురుషార్ధమును సర్వోత్తమముగా భావింపలేదు. ఇరువది యొకటవ సంవత్సరముతో స్త్రీ వ్యసనమును, ఇరువది యేడవ యేటితో గురుసేవా వ్యసనమును విసర్జించి వీరు నిర్మలులైనారు. వీరు స్త్రీ వ్యసనమునకు దమ్మిడీయైన వ్యయమొనర్పకపోవుట విశేషము.

శ్రీ దాసుగారి సద్యఃస్ఫూర్తికి, సంభాషణచతురతకు 'నా యెఱుక' యందు నిదర్శనములు సర్వత్ర గోచరించుచున్నవి. తమ సమ్మోహనరూపమును కాదని శివయోగినివలె నటించిన నరసన్నపేట వేశ్య నాకర్షించుటకు జావళిని విసరి లొంగదీయుట వీరి సద్యఃస్ఫూర్తి చేష్టలకొక నిదర్శనము. భీముడుగారి వేశ్యాశోధనవేళ నామె హృదయ రహస్యమును నెల్వరించుటకు "నా కడ విద్యనార్జించు శిష్యురాండ్రను కన్నబిడ్డలుగా చూచెదను” అని పల్కి, ఆమెచేత "నేను మీ శిష్యురాలను కాలేను సుండీ" అనిపించుట, గంగాధర రామా రాయణింగారు పారితోషికమిచ్చుచు 'సంతుష్టియేనా? అసంతుష్ట ద్విజోనష్టః' అన్నపుడు “సంతుష్ట ఇవ పార్థివ" అని గిలిగింతలు పెట్టించునట్లు, ఇతరులకంటే పైన అనుటయను తమ నైజగుణమును వెల్లడించునట్లు పలికి, అధిక గౌరవమును పొందుట మొదలైనవి సంభాషణ నైపుణ్యమునకు చిన్ని సాక్ష్యములు. "ఏమి హరికథలు వెధవ హరికథ" లని ఒకరన్నప్పుడు "పంతులుగారికి సహవాసబలము కాబోలు నెల్లపుడు విధవాస్మరణ చేయుచుందు" రనుట వంటి ఛలోక్తులు, శ్రీ దాసుగారి ప్రతిపక్ష ముఖవిధాన సమయస్ఫూర్తికి ఒక నిదర్శనము. “నయగారములు, నక్కటక్కులు, పలుపిచ్చవిద్యలు నెన్నతో బెట్టినరీతి నేర్చిన జాణలుగు వేశ్యలను" కొలను విడిచి కొండను దిగివచ్చిన


460

వావిలాల సోమయాజులు సాహిత్యం-4