వ్యంజనములు వడ్డించి ఉంచిన విస్తరిలో అన్నము పెట్టుకొని తిని, వారము సంపాదించుట, నిద్రపట్టక వేశ్య ఇంటికేగి "ఒంటరిగా పండుకొననిచ్చిన రెండు రూపాయలిత్తు" నని ఆమెను మోహపెట్టి పణ్యరహితముగ ననుభవించుట, భీముడుగారి వేశ్యాశోధన, విచిత్ర శివయోగిని వృత్తాంతము, వైష్ణవమిత్రునియింట పెద్ద గురుసేవ, హోటల్ కీపరుతో జట్టీ తెచ్చుకొనుట మొదలైనవి శ్రీ దాసుగారి స్వీయకథలోని విచిత్ర సన్నివేశములు ఎంతయు రమణీయములు. ఋతుపరిజ్ఞానము, బాల్యదశ, బరంపురము కోర్టు, పరీక్షలు, పడవ ప్రయాణము, వేశ్యల పరిచర్య, రాజమండ్రి టౌను హాలు, మదరాసు నేటివ్ క్లబ్, లాల్ బాగ్ పుష్ప ప్రదర్శనము, కార్తీక వనసమారాధనము మొదలైన మనోహర వర్ణనలు శ్రీ దాసుగారిని మహాకవికోటిలో చేర్పజాలినవై, “Style is the man” అను న్యూమన్ సిద్దాంతమునకు చక్కని సాక్ష్యములై యొప్పుచున్నవి. వీరి వర్ణనలు సౌందర్యపరిజ్ఞానపుంజములై నిరంతరమును "The poet's eye in a fine frenzy rolling...” అన్న షేక్స్పియర్ కవిచంద్రుని సుప్రసిద్ధ వాక్యమును జ్ఞప్తి యొనర్చుచున్నవి. ఏ దృక్కోణమునుండి పరికించినను 'నా యెఱుక' సౌందర్య సము పేతము.
5
శ్రీ దాసుగారు దృఢసత్త్వులు, సత్యనిరతులు, అతిపవిత్రులు, అనూచానులు జనించిన అమలిన వంశమున అవతరించిన ఆముష్యాయణులు. సహజశేముషీ పాండిత్య ధురంధరులు. రూపతేజో బలసంపన్నులై 'సింహసంహననమూర్తి' తో విరాజిల్లిన విశిష్టవ్యక్తులు, విద్యకుదగ్గ రూపవిభవముగల అదృష్టవంతులనియు, భక్తిని ప్రేరేపించు నవ్యక్తశక్తి యుక్తులనియు జనప్రశస్తి నందుకొన్న మహనీయులు.
పూవు పుట్టగనే పరిమళించు నన్నట్లు శ్రీ దాసుగారిని విశిష్టవ్యక్తులుగ రూపొందించిన గుణవిశేషములన్నియును వారియందు చిన్ననాడే కుదురుకొన్నవి. స్వశక్తిపై గాఢవిశ్వాసము, స్వయంకృషి, సాహసము, సత్యప్రియత్వము, స్వేచ్ఛా జీవనాసక్తి, యథాలాభ సంతుష్టి, కలహప్రకృతి, జయేచ్ఛ, అకారణ మిత్రత్వ శత్రుత్వములు, నిశిత పరిశీలనదృష్టి మొదలైనవి శ్రీ దాసుగారికి నైజగుణములు. వీరు బాల్యముననే ఆకలిని గూడ మరచి ఆత్మారాములై విహరించుచు మానవులందు తప్ప మిగిలిన చరాచర ప్రాణి విశేషములందన్నిటను దేవతామహిమను దర్శించిరి; మానవుల నెంతటి వారినైన నిర్లక్ష్యముగ జూచుట వీరి కా తొలిదశయందే అలవడినది. కవియై, జిజ్ఞాసువై, విచిత్ర సంకల్పమూర్తియై, తల్లిదండ్రులపై నైనను మమత్వమును
సాహిత్య విమర్శ
457