కెత్తిన రజతపతాక. నిత్యార్జిత కళాజీవనులైన వారు శిష్యకోటి యెడగల అనన్య వాత్సల్యాభిమానములతో అనుగ్రహించి యిచ్చిన జీవిత మార్గదర్శిక, వర్ధమాన కళాకారులకు సంశయభీరుతను (Decido Phobia) పోద్రోలి, భూరితరోపదేశము నీజాలిన గీతామహోపనిషత్తు, చిత్రవిచిత్రాను భవములకు శేవధి. లోకానుభవ విజ్ఞతలకు మణిమంజూష, రసవద్భావ భాషాసౌరభ్యములతో రసిక లోకమును రంజింపజేయు ప్రసవసముద్గుతము.
4
ఆంధ్ర సాహిత్యమునందు తొలి స్వీయచరిత్రగా ఉదయించినను “నా యెఱుక” స్వీయ కథాశిల్ప నైపుణ్యములనెల్ల పుణికిపుచ్చుకొనినది. ఇట్టి శిల్పశక్తి బహుభాషా కోవిదులైన శ్రీ దాసుగారికి పరభాషలలోని ఆత్మకథాగ్రంథములను పఠించుటవలన చేకూరిన శక్తి కాదు. స్వోపజ్ఞము. సరససాహిత్యకులు, శ్రోతల హృదయతంత్రులను మీటి ఉఱూతలూగింపగల ఉత్తమ కథకులునైన శ్రీ దాసుగారికి స్వీయచరిత్ర ప్రక్రియను ప్రత్యేకముగా నేర్వవలసిన పని యేమున్నది?
“ఉద్రేక పూరితమైన మనస్సునందు ఉత్సాహవశమున దోచు వింత యూహలకు యథోచితమగు నక్షరసందర్భములను గూర్చుట రచన" అని శ్రీ దాసుగారు నిర్వచించినారు. "నా యెఱుక” ఈ నిర్వచనమునకు తగిన లక్ష్యమై సర్వరచనా రామణీయకములను సంతరించుకొని చక్కని ఆత్మకథగా అవతరించినది.
“నా యెఱుక” యందు శ్రీ ఆదిభట్లవారు తమ జీవితమందలి సత్యకథాంశములను సౌందర్యపరిప్లుతములు గావించి ప్రదర్శించినారు. శ్రీ నారాయణదాసుగారిని స్వీయకథారచన కున్ముఖులను గావించిన ప్రబల హేతువులలో జనరంజకమైన వారి జీవితమునందలి రసరామణీయకత నంతర్ముఖులై గమనించుట యొకటి. స్వీయచరిత్రకు పూనుకొనిన పిమ్మట నీ సౌందర్యసంపాదనకై తమ జీవితమందలి ఏ ఘట్టముల నే దృష్టితో ప్రదర్శింపవలయునో శ్రీ దాసుగారు చక్కని సింహావలోకన మొనర్చి వాని నెన్నుకొన్నట్లు 'నా యెఱుక' సర్వత్ర సాక్ష్యమిచ్చుచున్నది. 'నా యెఱుక' యందు శ్రీ ఆదిభట్ల వారు ప్రస్తరించిన ఆత్మజీవిత సన్నివేశములన్నియు సౌందర్య సమునిషితములు.
ఆత్మకథారచయిత తన జీవిత సన్నివేశములను చిత్రించునపుడు, దేనికదియే విలక్షణము, సుందరమునై యుండియు, పూర్ణకథలో నొదిగిపోవుచు దాని వైలక్షణ్య,
సాహిత్య విమర్శ
455