దేవతామూర్తి కాదు. ఆధునిక జీవిత చరిత్రకారులకు అన్ని విషయములందును అగ్రగామియు, మార్గదర్శకుండునైన లిట్టన్ స్ట్రాచీ రచనామర్మములన్నియు, నాతనికి రెండు దశాబ్దులకు పూర్వమే తమ జీవిత చరిత్రను చెప్పుకొనిన శ్రీ దాసుగారి 'నా యెఱుక'లో కన్పట్టుట వారి ప్రజ్ఞాపాటవమునకు, సహజ సాహితీశిల్పనైపుణికి ప్రబల సాక్ష్యములు. తుదకు స్ట్రాచీ అనుసరించిన విడంబన ధోరణి (Mocking strain) సహితము 'నా యెఱుక' యందు తావు చేసికొనినది. శ్రీ దాసుగారు అక్కడక్కడ తమ్ముగూర్చి చెప్పుకొనువరకే ఈ అవక్షేపధోరణిని పరిమిత మొనర్చుకొనుటలో ఔచిత్యమును పాటించిరనుట సత్యము. పాత్రోన్మీలన వేళలందు కొన్నియెడల లుడ్విగ్ విధానము 'నా యెఱుక' లో కన్నట్టుట ఆశ్చర్యకరమైన అంశము. జీవిత కథనమునందు 'నా యెఱుక' అనేక రసవర్ఘట్టములలో అఖ్యాయికాప్రాయముగ సాగి, ఆండ్రూ మారా రచనలను తలపింపజేయుచు, ఇట్టి రచనాసౌందర్య విశేషమును 20వ శతాబ్ది ప్రారంభమునకు పూర్వమే దర్శించి ప్రదర్శించిన శ్రీ నారాయణదాసుగారికి కైమోడ్పు లర్పింప జేయుచున్నది. పరికించినకొలది శ్రీ నారాయణదాసుగారి 'నా యెఱుక’ యందు జీవితచరిత్ర రచనకు సంబంధించిన సర్వశిల్ప విశేషములును ఏదో ఒక తావున దర్శనమిచ్చి తీరుననుట అతిశయోక్తి కాజాలదు.
3
మహాపురుషుల సారవజ్జీవిత వైవిధ్యము, సాధించిన ఘనకార్యవైశిష్ట్యము, ఆదర్శప్రబోధములు, రసబాహుళ్య, రామణీయకతాది గుణవిశేషములు గౌరవానురాగములను కల్పించి జీవిత చరిత్ర రచనకు ప్రోత్సాహకము లగుచున్నవి. వివిధ జీవితరంగములలో పొందిన విశిష్ట విజయములను, స్వీయ గుణవర్తనలను, సాక్షీభూతులై భావించినపుడు ఉదార చరితులకు గలిగెడు స్వాభిమానము, స్వీయాదర్శాభివృద్ధి నాసించి ఒనర్పదలచిన శిష్యశిక్షణాసక్తి, పరులు అపార్థమొనర్చుకొని జీవిత చరిత్రలందెట తమ్ము సత్యేతర స్వరూపముతో ప్రదర్శించి ప్రయోజనావాప్తికి భంగపాటు కల్పింతురో అను భయసంశయాదులు స్వీయ కథారచనోద్బోధకములు, ఆత్మకథాజనన హేతువులు నగుచున్నవి.
ఆత్మపరిచయ మొనర్చుటయం దాస్ఠ వహింపకుండుట భారతీయులకును, వారిలో అంతర్భాగమైన ఆంధ్రులకును నైజగుణము. "తన్ను గూర్చి వ్రాసికొనునపుడు ఈశ్వరముఖమును జూచి సత్యమునే చెప్పబూనినను, సమకాలమువారు ఆత్మస్తుతిగానో, పరనిందగనో చేకొని భావింపవచ్చు" నని స్వీయకథారచనమునకు మొన్న
సాహిత్య విమర్శ
453