జీవితచరిత్ర రచన యొనర్చినాడు. పాత్రలను గూర్చిన ఊహాచిత్రములతో బయలుదేరి, పురావస్తుశాలలందు అనుగుణమైన సాధన సామగ్రి నెన్నుకొని లుడ్విగ్ బిస్కార్క్ గెథీ, ది సన్ ఆఫ్ మాస్, త్రి టిటన్స్, క్లియోపాత్రా మొదలైన జీవిత చరిత్రలను చెప్పి పిదప "విలియం II" "నెపోలియన్" లను రచించినాడు. జీవితాంశముల బాహుళ్యమువలనను, సర్వాంశములకు నెత్తిచూపిన అసంఖ్యాక నిరూపణములవలనను మొదటి రచనలందు పాత్రోన్మీలనమును కొంతగ మరుగుపరచినట్లు కన్పించినను, ఇతడు "విలియం II" నెపోలియన్'లలో విషయ విస్తృతిని, ప్రామాణ్య ప్రదర్శనములపై ప్రీతిని విసర్జించి సముజ్జ్వలముగ పాత్రలను చిత్రించుటలో సిద్దహస్తతను సంపాదించినాడు. విశ్వవిఖ్యాతి నార్జించి యిచ్చిన “నెపోలియన్" (1925) ఎమిల్ లుడ్విగ్ జీవిత చరిత్ర రచనయందు ప్రత్యేకముగ సాధించిన చిత్త చిహ్నాత్మకము, ఆలేఖ్య ప్రాయమునగు కథాకథన స్వభావము (Impressionistic and Pictorial Nature of Narration), సముజ్జ్వలముగ ద్యోతకమగు చున్నది. ఆబట్ రచించిన 'నెపోలియన్' కంటే నితని 'నెపోలియన్' జీవిత చరిత్ర వేయిమడుగుల విశిష్టరచనగా కీర్తికెక్కినది. బైరన్, షెల్లీ మహాకవుల జీవిత చరిత్రలు కథావస్తువులుగా “బోరన్', 'ఏరియల్' అన్న అనితర సాధ్యకృతులను జెప్పి, ఆధునిక జీవిత చరిత్రకు అత్యధిక ప్రజానురాగమును చేకూర్చిన ఫ్రెంచి రచయిత ఆండ్రూ మారా. పాత్రను గూర్చిన నిశితదర్శనము గలవాడగుటవలన నితడు 'బోరన్' లో బైరను చిత్రమును సత్యసమ్మతముగను, చిత్తాకర్షకముగను ప్రదర్శించినాడు. షెల్లీ మహాకవి జీవిత చరిత్రను చెప్పునపుడు 'ఏరియల్' లో ఆండ్రూ మారా పూర్వరచనారీతిని పరిహరించి, సముజ్జ్వలమైన నూతన రచనాశిల్పము ననుసరించినాడు. ఇందు ఈతడు నిరూపించిన మార్గమును విమర్శకలోకము 'అఖ్యాయికాప్రాయ జీవిత చరిత్ర' (Fictional Biography) అని వ్యవహరించినారు.
'నా యెఱుక' శ్రీ నారాయణదాసుగారు స్వయముగ చెప్పుకొనిన జీవిత చరిత్ర. ఉత్తమ కథకులై అశేష జనానీకము నానందాబ్దిలో నోలలాడించిన శ్రీ ఆదిభట్ల వారి జీవిత చరిత్రలో ఉత్తమ జీవిత చరిత్రలందు కన్పట్టు సమస్త లక్షణములును సమన్వయము నొందినవి. 'నా యెఱుక' సత్యసౌందర్యముల సమ్మేళనమని సర్వత్ర నిరూపించుకొనినది. 1903కు పూర్వమే పుట్టినను 'నా యెఱుక'లో శ్రీ నారాయణ దాసుగారు రూపొందించుకొన్న వారి వ్యక్తిత్వము ఆధునిక జీవిత చరిత్రకారులు ప్రీతి పడినదియును, జనానురాగ గౌరవములను చూరగొన జాలినదియునైన గుణదోష మిశ్రమగు మానవమూర్తియే కాని, పూర్ణ సద్గుణ పుంజమై వీరపూజను ప్రోత్సహించు
452
వావిలాల సోమయాజులు సాహిత్యం-4