రచన లోకమునకే విడిచిపుచ్చితిని” అని సమాధానమిచ్చినట్లును వినికిడి. “స్వయముగ చెప్పవలసిన అగత్యమున్నంతటి తన జీవిత కథను మాత్రమే స్వీయ చరిత్రకారుడు వస్తువుగా స్వీకరింపవలయును. అన్యమైన జీవితకథను ప్రదర్శించుపని జీవిత చరిత్రకారునిది” ఇది అనుభవజ్ఞులైన శ్రీ దాసుగారు సాహిత్యోపాసకుల కిచ్చిన అమలిన సందేశము. జీవిత చరిత్రను ప్రదర్శించు విషయమున ఇట్టి పరిణత దృష్టి గల శ్రీ దాసుగారి స్వీయచరిత్ర 'నా యెఱుక.’
2
'నా యెఱుక' స్వీయచరిత్ర అను సాహిత్య ప్రక్రియకు చెందిన కృతివిశేషము. వైషయికముగ స్వీయచరిత్ర, జీవితచరిత్ర ఒకేజాతిలోనివి. ఇవి ఆత్మకర్తృకమును, అన్యకర్తృకములై యుండుటయే ముఖ్యవిభేదము. శిల్ప విషయమున రెంటియందును వైధర్మ్యములకంటె సాధర్మ్యములే విశేషము. రెంటికిని మహాపురుష జీవితముపై నుదయించు ప్రణయగౌరవములే ప్రధానోద్బోధకములు. స్థూలదృష్టికి రెండును జీవిత చరిత్రలు. ఈ ఇరుతెగల కృతులు చెప్పినవారును జీవితచరిత్రకారులు.
"ఉదాత్త జీవనుల జన్మమువలె ఉత్తమజీవిత చరిత్రకారులు జన్మమును అరుదు” “జాన్సను లెందఱో ఉండవచ్చును; బాస్వెలు లెన్నడో గాని ఉదయింపరు" - ఆంగ్ల భాషలోని ఈ జిజ్ఞాసాత్మక వాక్యము జీవిత చరిత్రకు అర్హులైన వ్యక్తుల ఆధిక్యమును, ఉత్తమ జీవిత చరిత్రకారుల అతిశయమును, వేనోళ్ళ చాటుచున్నది.
జీవిత చరిత్రకారునకు మహాపురుష జీవితమునకు సంబంధించిన సత్యాంశకథనము ముఖ్యలక్ష్యము. కావ్య నాటకాది ప్రక్రియలను చేపట్టిన వారివలె నితఁడు విషయకల్పనలకు ఆసక్తి వహింపరాదు. సత్యప్రియులైన పాఠకలోకమును తృప్తిపరచి గౌరవానురాగములను చూరగొనుటకై ఇతడు గుణదోషములను రెంటిని యథాతథముగా ప్రదర్శింపవలయును. సౌందర్యోపేతముగ సత్యాంశకథన మొనర్చిన గాని ఇతని కృతి సాహిత్యసృష్టి కాఁజాలదు. సత్యసౌందర్యములు రెంటిని సమన్వయించుకొన్న జీవిత చరిత్రల విషయముననే “Biography is a literary work of art rivalling sculpture itself" అన్న విమర్శక వాక్యార్ధము చెల్లదగియున్నది. ఇట్టి సత్య సౌందర్య సమన్వయమును సంపాదింపని యెడ జీవిత చరిత్ర కేవల చరిత్ర రచన అనియో, కేవల సౌందర్య సృష్టి అనియో అనిపించుకొనును. ఉత్తమ జీవిత చరిత్రకారుడు మహాపురుష జీవితమునకు సంబంధించిన సత్యాంశములతో
సాహిత్య విమర్శ
449