షా వెలిబుచ్చిన "Every gentleman over forty is a scoundrel" అన్న ఛలోక్తిని స్మృతికి తెచ్చుచున్నది.
'నా ఎఱుక'ను శ్రీ దాసుగారు తమ ముప్పదియేండ్ల జీవితకథతోనే ముగించుట యందలి సామంజస్యమును మరొకరీతిగ భావింపవచ్చును. గురుముఖతః విద్యలార్జించువారు, ఆ గురువర్యులిచ్చు ప్రోత్సాహదోహదములతో విజృంభించి ఇంట గెలిచిన పిమ్మట రచ్చ గెలుచుచు జీవిత విజయపరంపరలను చేకూర్చుకొందురు. 'స్వశక్తితో విద్యలార్జించువారు, పరంపరాగతములైన ప్రోత్సాహదోహదములు సహజముగ సంప్రాప్తింపనందున వ్యతిక్రమమార్గమున స్వైర వీరవిహారము లొనర్చి తొలుత రచ్చగెలిచి తదుపరి ఇంట గెలిచి విజయపరంపరలను చేకొందురు. శ్రీ దాసుగారు రెండవకోవకు చెందిన ప్రతిభావంతులు. విద్వాంసులందలి స్పర్ధసంశయములు హేతువులుగా స్వస్థానమునందేర్పడిన వ్యతిరేకతలవలన వీరికి ఆరంభదశలోనే ఆత్మప్రభువులైన ఆనందగజపతుల ఆదరగౌరవములు లభించలేదు. అందుచే వీరు ప్రథమమున మైసూరు పర్యంతము పరస్థానములందు విద్యాజైత్ర యాత్రలొనర్చి, దిగ్విజయ గౌరవధన్యులై కీర్తిప్రతిష్ఠలతో తిరిగివచ్చి, విజయనగర ప్రభువుల ఆహ్వానసత్కారములందుకొనిరి. ఇట్లు "సర్వత్ర పూజ్యత" "స్వస్థల విజయ పరితృప్తి" లభించిన దశ శ్రీ దాసుగారి ముప్పదియేండ్ల వయసుతో ముగిసినది. శిష్యశిక్షార్థము ప్రదర్శింపవలసిన సమస్త ముఖ్యలక్షణములుగల వారి ప్రౌఢవ్యక్తిత్వము ఈ వయసునకు పూర్ణముగ రూపొందినది. లోకమునకు మార్గదర్శకములుగ వెల్లడింపదగిన జీవితానుభవములన్నియు వారి కీ కాలమునకే చేకూరినవి. ఈ సమస్త విశేషమును 'నా యెఱుక' రచనకు పూనుకొనుటకు ముందే సింహావలోకనమొనర్చి యుండుటవలననే, శ్రీ దాసుగారు తమ స్వీయచరిత్రకు ముప్పది సంవత్సరముల జీవితకథనే వస్తువుగా పరిమితమొనర్చి స్వీకరించియుందురు. శ్రీ దాసుగారి ముప్పదియేండ్ల జీవిత చరిత్రను వెల్లడించుటకు అనేకహేతువులు దృష్ట్యా వారే యోగ్యులు. అది స్వీయచరిత్ర రూపమున ప్రదర్శితమగుటయే సముచితము, పరమ ప్రయోజనకరము. శ్రీ దాసుగారు తరువాత గడిపిన ఏబది సంవత్సరముల జీవితము ఎంతగ రసవంతము, పండిత పామరజన సమ్మోహకరము, లోకజ్ఞతాప్రదర్శకము నైనదైనను, క్షుణ్ణమార్గమున మందాకినీ మహనీయతతో కొనసాగినది. కావున దానిని వారే చెప్పపని లేదు. భావికాల జీవితచరిత్రకారునకు, లోకమునకు విడిచిపెట్టవచ్చును. ఉచితజ్ఞులైన దాసుగారట్లే యొనర్చిరి. శిష్యులెన్నడైన ఆ ఏబది సంవత్సరముల జీవిత విశేషములనుగూర్చి ప్రశ్నించినపుడు, వారు "అందుకు లోకమే ప్రమాణమని దాని
448
వావిలాల సోమయాజులు సాహిత్యం-4