కవులిరువురే కన్పట్టుచున్నారు. అందు 'ఆంధ్ర కాళిదాసు', 'అభినవ కాళిదాసు' అను బిరుదులు పొందిన ఆలూరి కుప్పన కవి యొకడు. ఇతడు తన కాంధ్ర కాళిదాస బిరుదమును తుళజ మహారాజిచ్చినట్లుగా చెప్పుకొని యున్నాడు.14 ఇతడు బహుకావ్యకర్త. కాని యితని ఆచార్య విజయ, పార్థసారథి విజయములు15 తప్ప మిగిలిన కావ్యములను జూచు భాగ్య మటాంధ్ర సారస్వతవేత్తలకు లభింపలేదు. ఇత డాచార్య విజయమున తాను రచించిన యితర గ్రంథములను గూర్చి క్రిందివిధముగా చెప్పుకొనియున్నాడు :
సీ. లీల పంచనదస్థలీపురాణము తెని
గించితి నారూఢి కవిత మెరయం
బరగు రామాయణ భాగవతంబులు,
యక్షగానము జేసి తద్భుతముగ
గరమొప్ప పరమభాగవత చరిత్రయు
కృతియొనర్చితిని యున్నతిదలిర్పఁ
దెలివొందు నిందుమతీ పరిణయనామ
కృతి విరచించితి నతులగరిమ
గీ. (?) గురుతరోజ్జ్వలసరణి హరి క,
థాసుధాభిధకావ్య ముదారఫణితి
గా రచించితి నెనలేని గద్యపద్య
తతులు, లెక్కింప దఱమె తత్కృతులు జగతి.
ఈతని కావ్యములవలెనే యీ నాయకుల పరిపాలనమున రచియింపబడిన గ్రంథములు అనేకము లింతవరకును దృష్టిపథగోచరము కాకున్నవి. ఆలూరి కుప్పన కర్తృత్వమున 'పార్థసారథి విజయ’మను నొక తాళపత్రగ్రంథము మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునందున్నది. కుప్పనకవి యాచార్యవిజయమున 'అనంతానందగిరి గురురచనా విశదంబు చేయంబూని' యని చెప్పియున్నాడు. ఇందు పేర్కొనబడిన అనంతగిరి సంస్కృత శంకరవిజయ కర్త కావలయును. ఈ సంస్కృత శంకరవిజయము కొలది కాలము క్రిందట ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచే సంపాదింపబడినట్లు దెలియుచున్నది.16 ఈ శంకరాచార్య విజయమును కవి చెన్నపురి ప్రజల కోరికపై రచియింతినని చెప్పుకొని యున్నాడు. ఇతని కవనము ప్రబంధ కవుల కవితాధోరణి గల్గి రసవంతమై యున్నది. ____________________________________________________________________________________________________
440
వావిలాల సోమయాజులు సాహిత్యం-4