వేయించి, నటియింపజేసియు ప్రజల నానందాబ్ది నోలలాడించెను. ఇతని కాలమున రచింపబడిన పద్య కావ్యములు కన్పింపవు. ఇతని కాలమున తిమ్మయ్య ద్విపద మహాభారతము తిరుగ వ్రాయింపబడినట్టు దెలియుచున్నది. ఈ గ్రంథమే గాక తనకు బూర్వము వ్రాయింపబడినవియు, క్రిమీదష్టమై శిథిలత్వ మనుభవించుచున్నవి యునగు గ్రంథ పరంపర నుద్ధరించెను.
శాహజీ మహారాజు 'శృంగారంబున పొంగారు' 'గంగాపార్వతీ సంవాద' మను నాటకమును రచించెను. ఇందలి కథావస్తువు, 'సర్వేశ్వరుడు గంగతో వనమున విహరించువేళ నారదుడు వచ్చి గంగను స్తుతించి పార్వతిని నిందించిన సమయమున పార్వతి సఖి దానిని విని దేవికి దెలియుజేయుట, ఆ సమయమున సవతుల పోరాటము ఈశ్వరుడు వారి కయ్యమును మాన్ప నొకతెను శరీరమున, మరియొకతెను శిరమున ధరించుట.’ ఈతని నాటక రాజము లీతని పాండిత్యమును వెల్లడిజేయుచున్నవి. సహజవర్ణనలు, పాత్రోచితభాషలు, జాతీయములు ముఖ్యముగా జీవద్భాషలీ నాటకములకు బెట్టని శృంగారములు. ఇతడు 'కిరాతవిలాస'మను మరియొక నాటకమును రచియించెను. ఇతడు వ్రాసిన నాటకములలో మేలు బంతియని పొగడదగినది 'త్యాగరాజవినోద చిత్రప్రబంధనాటకము'. ఈ నాటకమున మహారాజు అష్టాదశవర్ణనల నినుమడింపజేసి ప్రబంధత్వము కల్పించెను. తన పాండితీప్రకర్షను వెల్లడియొనర్చుటకై యీ నాటకమును సంస్కృతపద భూయిష్టముగా రచియించి, నాటకములన్న పండితుల కామోదమును రగుల్కొల్పెను. తన కవితాశక్తి కోర్చిన యీ నాటకమున కవి సంస్కృతము, మహారాష్ట్రము, తెలుగు భాషలకు సమ్మేళనము కల్పించెను. ఈ నాటకమునందలి పాత్రలు పై మూడు భాషలలోను ప్రసంగింతురు. ఈ నాటకమునకు బ్రేక్షకులు శిష్టులు గాని నిరక్షరులు కారు. పండిత పామర జనానందముగా నాటకములు రచియింపగల యీ కవిరాజన్యుడు, ద్రౌపదీ కల్యాణమును రచియించెను. నటరాజగు నీశ్వరుని యొద్ద చెంచు మొదలగు నాట్యకర్తలు తమ నటనాకౌశలమును జూపి బిరుదులను బడయుట కథావస్తువుగాగల 'పంచరత్న ప్రబంధ' మను నాటకమును శాహ మహారాజు కొలది కాలములో రచించితినని చెప్పుకొనెను. ఇతడు తన 'పార్వతీపరిణయ' మను నాటకమును 'వేష భాషాదియుతముగా’ విస్తరింతునని చెప్పెను. కాబట్టి శాహమహారాజుకు నాటకమన్న నెట్టి యభిప్రాయము గలదో తేటతెల్లమగుచున్నది. నాటకమున పాత్రోచితభాష, వేషము లేకపోయినచో నది దృశ్యకావ్య మనిపించు కొనదుగదా! అనగా శాహావనీపతికి నాటకము లెట్లు వ్రాయవలయునో, యెట్లు వ్రాసిన ప్రజల హృదయము రంజిల్లునో దెలియునన్నమాట. ____________________________________________________________________________________________________
సాహిత్య విమర్శ
431