రాగాంగగాన క్రియాస్థాయి గనక ప్రబంధ ధాతు గాయనగణితానదర్గాహకుండ' (?) నని చెప్పుకొని యున్నాడు. కాని యితనికి కవితాకళ, గానకళలందు పాండితి యపారమని తెలియుచున్నది. స్వయముగా తాను కవియగుటయే గాక తన యాస్థానమునందనేక కవులకు గాయకులకు పోషణము కల్పించెను. ఈతడనేక కృతులకు భర్తయు కర్తయు నగుటయే గాక కృతులలో నాయకుడు గూడనై యున్నాడు. ఇతడిట్టు భాష కపారసేవ యొనర్చి తన నామమునకు వాఙ్మయ చరిత్రయందు చిరస్థాయిత్వము కల్పించుకొని యున్నాడు. ఇతనికి గాన కళాభిరుచి మెండు.
త్యాగరాజ స్వామివారి వంశకర్తలలో నొకడగు వెంగనార్యుడను గాయకశిరోమణి యీతని యాస్థాన మలంకరించెను. శాహజీ మహారాజు సంస్కృతమునం దసమాన ప్రతిభావంతుడై ‘చంద్రశేఖర విలాస' మను రసవత్కావ్యమును రచించెను. శాహజీ యాస్థాన మలంకరించిన సంస్కృత కవులలో నీలకంఠ దీక్షితుని తమ్ముడగు అతిరాత్రయాజి యొకడు. ఇతడు కవితారచనలో నఖండుడు. సర్వస్వతంత్రుడు. ఇతడు మృదుమధుర పదభూయిష్టమగు 'కుముద్వతీపరిణయ' మను నైదంకముల రూపకమును రచించెను. సంస్కృత వాఙ్మయముగల చంపువులలో నగ్రస్థానము వహింపదగిన 'ధర్మవిజయ' మను గ్రంథము నల్లదీక్షితకవిచే శాహజీ మహారాజు కోరికపై రచింపబడెను. శాహజీ మహారాజు పరిపాలన కాలమున అతనినే కావ్యనాయకునిగా నొనర్చి రచించిన కావ్యపరంపర బహుళము. అట్టి వానిలో సంస్కృతమునందు చొక్కనాథ కవిచే రచింపబడిన 'కాంతిమతీపరిణయ' మను రూపక మొకటి. అయ్యవాలనబడు శ్రీధర వెంకటేశ్వర కవి పండితుని శాహరాజాష్టపదియు, గంగాధర పండితుని భోసల వంశావళియు, లక్షణకవి శాహరాజ సభాసరోవర్ణనియు పై రకమునకు జెందిన గ్రంథములు, తంజావూరి మహారాష్ట్ర నాయక చరిత్ర వ్రాయదలచుకున్న చరిత్రకారులు కిట్టి గ్రంథములు ముఖ్యాధారములు.
ఇతని కాలమున సంస్కృతము కన్న హెచ్చు తెలుగు వాఙ్మయ మభివృద్ధి జెందినట్లు కన్పించును. ఇతడాంధ్ర వాఙ్మయమునందలి బహునాటకములకు కర్త. తంజావూరు విజయరాఘవుని కాలమునందువలెనే యీతని కాలమున హెచ్చు యక్షగానములు, నాటకములు, దండకములు, కొరవంజులు వ్రాయబడినట్లు కన్పించుచున్నది. ఆంధ్ర నాయకులగు రఘునాథ, విజయ రాఘవ నాయకుల కాలమునుండి వచ్చు నాటకములతో బాటు తాను కొన్ని నాటకముల రచించియు, నితర కవులను బ్రోత్సహించి వారిచే రచియింప జేసియు, రంగస్థలముపై వేషముల 430 వావిలాల సోమయాజులు సాహిత్యం-4 ____________________________________________________________________________________________________
430
వావిలాల సోమయాజులు సాహిత్యం-4