Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వాత్స్యాయనుడు గావించిన స్త్రీ ప్రకృతి (స్త్రీ స్వభావ) వర్గీకరణ అతి విశిష్టంగా ఉన్నది. స్త్రీలను పూర్వ మహర్షులు వారి బహుముఖీన ప్రకృతిని అనుసరించి వర్గీకరించారు. స్త్రీ ప్రకృతి ఆమె మనోగుణాలమీద ఆధారపడి ఉంటుంది అని ఆయన తెలియజేశాడు.

చాపల్యం, లౌల్యం వాత్స్యాయనుడి స్త్రీలకు సంకేతములు. ఆయన దృష్టిలో వారు చతుష్షష్టి కళలను నేర్వవలె. ఎవరు చతుష్షష్టి కళలను అభ్యసిస్తారో ఆ స్త్రీలు వారి మాతాపితరులు, లేదా రక్షకులు లేదా భర్తలు లేనప్పుడు గృహకృత్యాలు, లలితకళలు, కర్మకౌశలాలు కలిసి ఉండటం వల్ల - కళలశ్రేణి అతి విస్తృతమైనది. కనుక, యిది యేమీ సుదూరానికి చేర్చే సిద్ధాంతం కాదు - వారి జీవనసాధనలను ఆర్జించుకొనగలరు అని ఆ మహర్షి తెలియజేశాడు.

భారతీయ స్త్రీలు కళలలోను, గణితం, వ్యవసాయంలోను, ఖగోళ శాస్త్ర, పాక శాస్త్రాలలోను రసాయనశాస్త్ర, వస్త్రధారణలలోను, కాంతి శోభావర్ధకాలలోను, ఆలేఖనము, నాట్యము, వినయరీతి (శిష్టాచార లేదా సదాచార రీతి) యంత్ర విద్య, యుద్ధ విద్య, భాషాశాస్త్రము, పాండిత్యము, ఇంద్రజాలము, లోహ శాస్త్రము, చిత్ర లేఖనము, కవిత్వము, ఛందో విజ్ఞానము, పఠనము, గానము, ప్లవనము, లేఖనములలో సంపూర్ణంగా శిక్షితలు గావింపబడవలె. వాత్స్యాయనుడు స్త్రీలను నిస్సందేశార్థమూ, నిష్కాపట్యము (నిర్వ్యాజము) అయిన భాషలో వర్ణించాడు. వాత్స్యాయనుని కామసూత్రం స్త్రీలకు అగ్రశిఖరలేఖనాన్ని ప్రసాదిస్తున్నది, వారి యెడ ప్రశంసలను, విశేషాలను (ఉపాధులనూ) కురిపిస్తున్నది.

వాత్స్యాయన మహర్షి మహాగ్రంథపఠనం పాఠకుడిని అది ఒక తాంత్రిక మూలాధారగ్రంథమని విశ్వసింపజేస్తుంది. లైంగికగహనత, గూఢత తాంత్రిక ప్రధానాంశాలలో మత సంప్రదాయంలోని అనుయాయి అయిన దాని పూర్ణోపపత్తిని, దాని పూర్ణవ్యక్తీకరణమును (పరిపూర్ణ స్పష్టీకరణమును), దాని పరమ విస్తృత తత్త్వాన్ని వీక్షిస్తారు గనుక ఒకటి అయి ఉన్నది.

A deep study of Vatsy ayana compels one to believe the sage's magnum opus in a tantric text. Sexual mysticism was one of the main aspects of Tantrism, for it is in this cult that one finds it full rational, complete expression and most extended phylosophy. 424 Times of India (3-5-87)

వావిలాల సోమయాజులు సాహిత్యం-4