Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీ.శ. 12 శతాబ్దిలో లిఖితాలైనవి. కులార్ణవ తంత్రము (సిర్కా 9 శతాబ్దము) రుద్ర - యమలము (సిర్కా 10వ శతాబ్దము) (బ్రహ్మ యమలము (సిర్కా 1100) కౌలోపనిషత్తు ఇందులోనివి.

వామాచారతంత్రాలలో అధిక సంఖ్యాకాలు మూల సిద్ధాంతాలు వ్యక్తీకరింపబడ్డ శివశక్తుల సంభాషణల రూపంలో ఉన్నవి. తాంత్రిక విద్య ప్రధాన పీఠాలలో వంగదేశపాలకులైన 'పాల' వంశ రాజన్యులచేత సుస్థాపితాలైన రెండు విశ్వ విద్యాలయాలు ప్రసిద్ధాలు. ఇందులోని విక్రమశిల విద్యాలయం క్రీ.శ. 810లో మగధకు తూర్పున ధర్మపాల రాజన్యుడి చేత అల్పపర్వతం మీద, లేదా అల్పతరమైన గంగ మీద స్థాపితమైనది. రెండవది జగద్దల. ఇది క్రీ.శ. 1090లో ఉత్తర వంగదేశ ప్రాంతంలో, రామపాల రాజన్యుడి చేత స్థాపితమైనది. ఈ రెంటినీ కుతుబుద్దీన్ ఐబక్ సైన్యం క్రీ.శ. 1198 లోను, క్రీ.శ. 1207లోను ధ్వంసం చేసినవి.

భారతీయ యువ నారీజనాఖ్యాతాధిక్యములు మన జాతీయ వారసత్వంలో అభివ్యక్తులయ్యే అజ్ఞాతులు, అకీర్తితులు, అపూజ్యులు అయిన పురాశిల్పుల కృషిలో ప్రతిఫలిస్తున్నవి. వారి సద్గుణాలు, శక్తి వీరత్వాలు, అజంతా ఎల్లోరా గుహలలోను, ఇతర గుహల్లోను ద్యోతకమయ్యే "కుడ్యశిలా చిత్రాలలో, (Murals) ఖజురహో, కోణార్కము, రాజస్థానము, దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో వినిర్మితమైన శిల్పాలలోను అగ్రతలానికి తీసుకురాబడ్డవి. సత్యానికి వస్తే ఈ గుహలు, దేవాలయాలు శిలానిర్మితాలైన మహాగీతికలు. ఇవి స్త్రీ జనుల వైశిష్ట్యాలను ప్రదర్శించేటందుకు శిలాశిల్పితాలైన విజయప్రశస్తులు. ఉత్కృష్టములు, చేతనోపేతకాలు అయిన ఇవి కళకు సంబంధించిన పరమాధునిక భావనాకేంద్రాలు. వీటిలో స్త్రీలు, వారి దోలాయతములు ప్రతి బింబీకృతములు, క్రీడాయుతములు, ప్రేమశలములు అయిన బాధలలో నిదర్శితలైనారు. శైలశిలాకుడ్యాలమీద అర్ధచంద్రద్వయాల మీద నాగదంతాల మీద లఘు స్తంభాలమీద, కుంచితాగ్రాల మీద ఛిద్రాలమీద నివేశాల మీద స్తంభాల మీద స్థాణువుల మీద వారు అంతటా ప్రతిస్థలంలోను ఉన్నారు.

ఈ నాడు స్మృతిలో లేని పురుషులు కొందరు స్త్రీలు ఐంద్రజాలిక స్పర్శ గలవాళ్ళయినట్లు విశ్వసించారు. వారిని అనుసరించి వృక్షాలు అందగత్తెలయిన ఆడువారి స్పర్శను ప్రగాఢంగా అభిలషిస్తాయి. అందువల్ల వకుళ వృక్షం, యువతి ముఖోద్ధతమైన ద్రాక్షారసంచేత చిలుకరింపబడితే అది ప్రసవించేటట్లు, అశోకవృక్షం (Saraca Indica) ఒక కన్యకామణి పాదస్పర్శ వల్ల నారంగ లేదా శోణవర్ణ పుష్పాలను ప్రసాదించేటట్లు చెప్పబడినది.

సంస్కృతి 423