Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందుకు భిన్నంగా, భారతదేశంలో 15000 సంవత్సరాలకు పూర్వమే తంత్రగ్రంథాలు, వాటి ప్రకాశకులు స్త్రీల ఉద్యమాన్ని (సంచలనాన్ని) సాగించటం జరిగింది. పాశ్చాత్యదేశాలు ఇంకా అంధకార యుగాలలో నిద్రాముద్రితాలవుతున్న కాలంలో అవీ, వారు ఉభయ లింగకుల (స్త్రీ పురుష) సామ్యతకు చెందిన విప్లవాత్మకాలు అయిన భావాలను సర్వత్రా నిదర్శనాలు గావించటం జరిగింది. వీటికి ఉన్ముఖులు అజ్ఞాతులు, గౌరవాలను పొందనివారు, అకీర్తితులు అయిన పుంతాత్త్వికులు తప్ప ఇతరులెవ్వరూ కారు. వారు స్త్రీ విముక్తిని, ప్రశాంతంగాను, అగోచరంగాను, అనుగ్రహయుతంగానూ కొనివచ్చినారు. ఏమైనప్పటికీ ఈ విషయంలో తంత్రాలు నిర్వహించిన విశిష్ట పాత్ర ఇంతవరకు అంగీకరింపబడటం జరుగలేదు.

తంత్రాలు సతీ హస్తబంధాలనుంచి విముక్తురాండ్రను గావించి భారత స్త్రీలకు విముక్తి విమోచనను ప్రసాదించటానికి ఎంతగానో తోడ్పడ్డవి. సతీ తంతును (సహగమనాచారాన్ని) మత ప్రవచనాలకు, మానవత్వానికి సామాన్య మనోభావానికి వ్యతిరేకమైన ఆటవికాచారమని చిహ్నితం గావించి, తంత్రాలు దానిని సందిగ్ధరహితంగా నిందించినవి. ఈ విషయాన్ని మహానిర్వాణతంత్రం ఇలా ప్రకటించింది. “ఒక స్త్రీ తన అజ్ఞానాంధకారం వల్ల మృతినొందిన పతి చితి మీదికి అధిరోహించినట్లయితే ఆమె నరకానికి వెళ్ళి తీరుతుంది!”

పురాతన మాధ్యమిక కాలాలలోని అక్రమపరులైన న్యాయప్రదాతలు, సాహిత్యకులు, విద్వాంసులు అయినవారి వినాశకరమైన విజ్ఞాపనలు ఎలా ఉన్నప్పటికీ తంత్రగ్రంథాలు వశీకరణాంధకార ప్రదేశంలోనికి ఆదిత్యకాంతిని ఆభాసింపజేసినవి. తాంత్రిక సిద్ధాంతాలు సర్వలైంగికులకు, సర్వధర్మాలకు, సర్వ వర్గాలకు, సర్వ వర్ణాలకు ప్రసారితాలు. విషయానికి వస్తే తాంత్రిక ప్రచారకుల్లో పరమ ప్రముఖుల్లో కొంతమంది స్త్రీలే.

తాంత్రికత్వానికి మూలాధారం ఏమిటో అభివ్యక్తం కావటం లేదు. ఏమైనప్పటికీ కొంతమంది విద్వాంసులు సర్వభారతీయ ధర్మాలలో దానిని పరమ పురాతనమైనదిగా విశ్వసిస్తున్నారు. అంతేకాక వారు దానిని భారతదేశంలోని ఆర్యులకు (స్వీకృత మతాలలో) పూర్వులైన ప్రజల మతంగానూ, యోగ శాస్త్రానికీ, భారతీయ గూఢతకు, భారతీయ గుప్త విద్యకు (Indian Occufison) మూలాధారంగానూ, భావించారు. అది ఆఫ్ఘనిస్థానం మొదలు అస్సాం వరకు సరిహద్దు ప్రాంతాలల్లో ప్రగాఢంగా లగ్నమై ఉన్నది. సాంప్రదాయికశాఖల మీద వ్యతిరేకంగా విప్లవాత్మక చిత్తప్రవృత్తిని ప్రసరింపజేసింది. సంస్కృతి 421