తంత్రాలలోని స్త్రీ జనాలేఖ్యం
పాశ్చాత్య స్త్రీలు ఈ శతాబ్దం ద్వితీయ దశకంలోనే అనుమోదన (సమ్మతి) పౌరసత్వాన్ని (వోటింగు హక్కును) ఆర్జించారు. ఈ సంపాదనం నిశ్చయంగా జనోద్యమ ప్రగతిలో విశిష్ట పదచలనము.
నెదర్లాండ్సు 1917 సం॥లో వైశ్వాత్మక (అనుమోదన) పౌరసత్వ సిద్ధాంతాన్ని ప్రథమతః విస్తరింపజేసింది. తరువాత ఆస్ట్రియా, బ్రిటను, బాల్టిక్ దేశాలు, జకోస్లావియా, జర్మనీ, ఐర్లండు, లక్జెంబర్లు, స్కాండినేవియన్ దేశాలు అనుసరించటం జరిగింది. అమెరికా 1920లో స్త్రీ పౌరసత్వాన్ని ప్రకటించింది.
1970వ సంవత్సరాలలో 90 దేశాల్లో విస్తరించి ఉన్న ఆరు కోట్ల సభ్యులు గల ఆంగ్లికను చర్చికి చెందిన పాశ్చాత్యదేశాలలో పురుష పాలనవప్రవిచ్ఛేదం జరిగింది. 1971 నవంబరు 28న హాంగ్ కాంగ్లో ఆంగ్లికన్ చర్చివారు, ఇరువురు స్త్రీలు వారి పౌరోహిత్యానికి నియమితురాండ్రు గావింపబడటంతో, చరిత్రాత్మక పరివర్తనకు బంతిని ప్రయోగించటం ప్రారంభమైనది. 1976 నవంబరులో కెనడా దేశంలోని ఆరుగురు స్త్రీలు మంత్రివర్గంలోనికి ఆహ్వానితులయినారు. 1977లో అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎపిస్కోపల్ చర్చివారు ఆరుగురు స్త్రీలను పురోహితులనుగా నియమించారు.
ఇందుకు భిన్నంగా ఇంగ్లండు చర్చివారు 1975 జులై నెలలో స్త్రీలు పౌరోహిత్యంలోకి ప్రవేశించవచ్చు అన్న విషయాన్ని సిద్ధాంతరీత్యా అంగీకరించారు. ఈ విషయం 15 సంవత్సరాలుగా అన్యగర్భితమై ఉన్నది. ఇప్పుడు ఇంగ్లండులో ఇంకా స్త్రీలు పౌరోహిత్యానికి నియమితులు గావింపబడవలసి ఉన్నారు.
పౌరోహిత్యానికి స్త్రీలను నియమించటం విషయాన్ని రోమను కాథలిక్ మతపీఠంవారు సంపూర్ణంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 1977 జనవరి 27న పోప్ పాల్ VI "జీసస్ పురుషుడు. ఆయన ఆత్మ మాతృమూర్తి మీద పౌరోహిత్యాన్ని ప్రసాదించలేదు గనుక స్త్రీలు ఎన్నడూ తమను కాథలిక్ మత పురోహితులుగా గుణీభూతలను గావించుకొనలేరు” అని ప్రకటన గావించాడు.420 వావిలాల సోమయాజులు సాహిత్యం-4