విశ్వవాదము, వైద్యుతము, అంగిరము. వార్షమము వారి సోమలత. అవ్యాంగము వారి యజ్ఞోపవీతము.
కృష్ణకుమారుడు సాంబుడు కట్టించిన సూర్యదేవాలయం మూల్తాను (మూలస్థానము) లోని ఆలయమని చరిత్రకారుల అభిప్రాయము. మూలస్థాన సూర్య దేవాలయాన్ని చైనా యాత్రికుడు హుయత్సాంగు, అరబ్బు పండితుడు ఆల్బెరూనీ ఎరుగుదురు. ఈ ఇరువురూ ఆ దేవాలయప్రతిష్ఠనూ, ప్రభావాన్నీ వారి చరిత్రల్లో ఉటంకించారు. మూల్తానును జయించిన మహమ్మదు బిన్ ఖాసిమ్ దానికి 'ఆల్మమురా' అనే నామం ఉంచినాడు. కడసారిగా సింధు రాష్ట్రంమీద దండెత్తిన ఔరంగజేబు, ఈ దేవాలయాన్ని నేలమట్టం చేశాడు. 'అల్-ఇర్ది'ష్ మూలస్థానంలో సూర్యవిగ్రహాన్ని, దేవాలయాన్నీ నేలమట్టం చేశాడు. హర్షవర్ధనుడూ, అతని వంశస్థులూ, సూర్యోపాసకులు. అతని తండ్రి ప్రభాకరవర్ధనుడు. ఇతడు నిత్యమూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసేవాడట. మయూరుడు సూర్యశతకాన్ని చెప్పి కుష్ఠురోగాన్ని పోగొట్టుకున్నట్లు జనశ్రుతి. ఈ శతకంలోని ఆరు శ్లోకాలు కాంచీ పురంలోని ఒక శిలాఖండం మీద లిఖితమై ఉన్నవి.
భారతదేశంలో సూర్య దేవాలయాలు విశేషంగా లేవు. ఒరిస్సాలో కోణార్క సూర్యదేవాలయం ప్రసిద్ధమైంది. కాశ్మీరంలోని శ్రీనగరానికి వెళ్ళే త్రోవలో ఉన్న మార్తాండాలయము మరొకటి. ఒక రథంమీద పక్షి మొగంతో ఉన్న వ్యక్తి రథచోదకుడుగా ఉన్న మరొక సూర్యశిల్పం, కలకత్తాలో వారణాసి ఘోషు వీథిలో ఉంది. దక్షిణదేశంలో కేవలం సూర్యదేవునికి అంకితంగా కట్టిన దేవాలయం తంజావూరు మండలంలో 'సూర్యనార్ కోయిల్' అనే నామంతో కీర్తి కన్నది. దీనిని బహుశః కనూజ్ గుహద్వారాలతో ఉన్న పరిచయం కారణంగా కులోత్తుంగ చోళ దేవుడు (క్రీ.శ. 11వ శతాబ్దము) కట్టించి ఉంటాడని నీలకంఠ శాస్త్రిగారి 'చోళ చరిత్రలో' వ్రాసినారు. దాక్షిణాత్య దేవాలయాలన్నిటిలో ఉన్న నవగ్రహాలలో ఆదిత్య విగ్రహాలు కనిపిస్తున్నవి. ఉత్తరదేశంలోని ఆదిత్య విగ్రహాల చేతులో ఉన్న తామరలు పూర్ణంగా వికసించినవి. దక్షిణదేశంలో అవి మొగ్గలు. అదే ఉత్తర దక్షిణ దేశ సూర్యవిగ్రహాలలో కనిపించే ముఖ్య విభేదం సూర్యారాధనా విధానం, వాయు పురాణం 12వ అధ్యాయంలో విపులంగా కనిపిస్తున్నవి.
(సూర్య విగ్రహనిర్మాణాన్ని గురించీ, ఇతర విశేషాలను గురించీ సంక్రాంతి స్వరూప స్వభావాచారాలను గురించి ఆంధ్రపత్రిక, వారపత్రిక జనవరి 12-1- 1949 'సంక్రాంతి - సూర్యోపాసన' అనే నా వ్యాసాన్ని చూడవలసిందని ప్రార్థన.)
సంస్కృతి
419