బృహత్సంహిత ఆదిత్య చారాధ్యాయంలో సూర్యబింబంలోని మచ్చలను
(Sun-Spots) గురించి విశేషంగా ప్రసంగం కనిపిస్తున్నది. వీటిని తామస కీలకాలని
జ్యోతిష శాస్త్రజ్ఞులు వ్యవహరిస్తారు. వీటివల్ల కలిగే అరిష్టాలను గురించి విశేషాంశాలు
జ్యోతిశాస్త్ర గ్రంథాలలో కనిపిస్తున్నవి. వీటిలో సూర్యమండల విస్తృతి, గమన విశేషాలూ
గుర్తింపదగినవి.
***
ప్రాచీన హిందువుల నిత్య నైమిత్తిక కర్మల్లో సూర్యభగవానుడు ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించాడు. ఋగ్వేదంలోని (III-62) గాయత్రీమంత్రం ఆదిత్యవర్గంలోని సావిత్రిని గురించి చెప్పినా, తరువాత సూర్యునికి ఉద్దేశితమైంది. రామాయణంలో రామరావణ యుద్ధం అంతం కాబొయ్యే సమయంలో అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి ఆదిత్య హృదయాన్ని చెప్పినాడు. భారతములో (మూడవపర్వము) సూర్యదేవుని అష్టోత్తర నామావళి కనిపిస్తున్నది. ఇది బహుశః స్కాందములోని కాశీఖండాన్ని బట్టి చేరి ఉంటుంది. బహుకాలం వరకూ సూర్యుడు ప్రతిమారూపాన్ని పొందకుండా ప్రకృత రూపుడుగానే ధ్యానితుడౌతూ వచ్చాడు. సూర్యుని ప్రతిమా స్వరూపము ఉత్తర పశ్చిమ భారతదేశంలో క్రీస్తు పుట్టుకకు తరువాత జరిగి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయము. ఈ ప్రాంతం బహుకాలం నుంచీ ఇరానియను దేశసంస్కృతితో పరిచయం కలిగినది. 'మిత్రసు' పర్షియను దేవత. ఇతడు మధ్యలోకంలోని ద్యుదేవత కాళరాత్రితో నిరంతరమూ పోరాడుతూ ఉన్న ఇరేనియనుల దేవాధిదేవుడు అఫెబార్ మజ్దాకు విశేష సహాయం చేసినట్లు వారి పురాణాలు పలుకుతున్నవి. వీరి ఉద్దేశాలతో సంబంధం కల సూర్య ప్రతిమలు, ఉత్తర పశ్చిమ భారతంలో దొరికిన నాణాల మీద కనిపిస్తున్నవి. బౌద్ధ సాహిత్యంలో సూర్యునికి తుల్యమైన దేవతలుగా కనిపిస్తున్న మైత్రేయ, అమితాభులు పర్షియను ప్రభావమూలంగా కలిగినవారని అభిజ్ఞుల అభ్యూహ. భారతదేశంలో అనాది నాణెముల మీద కనిపించే చక్రాన్ని, ధర్మచక్రంగా కొందరు భావించారు. కానీ ఇది సూర్యదేవునికి ప్రతీక అని శ్రీ కె.ఎ. నీలకంఠ శాస్త్రి, ప్రభృతుల అభిప్రాయము. హేమాద్రి వ్రతఖండంలో సూర్యవ్రతాన్ని గురించి వ్రాస్తూ సూర్యుణ్ణి పన్నెండు దళాలు కలిగిన పద్మంగా నిరూపించవచ్చునన్నారు.
సంస్కృతి
417