శ్లో. 'జననీ సర్వభూతానాం సప్తమీ సప్త సప్తికే
సప్తవ్యాహృతికే దేవి నమస్తే రవిమండలే |
సప్తసప్తి వహక్రీత సప్తలోక ప్రదీపన
సప్తమ్యాంహి నమస్తుభ్యం నమోంతాయ వేధసే ॥'
రవికి దేవత శివుడట. 'ఆదిత్య ప్రభవో విష్ణుః' అనే వాక్యం ఉన్నా సరే, తెల్లవారగానే అగ్ని సూర్యుడిలో ప్రవేశిస్తాడట! సూర్యుని కిరణాలు ఏడనీ, వేయి అనీ ఉంది. అతని వెలుగు తెలుపనీ, కారు నలుపనీ ఛాందోగ్యోపనిషత్తు తెలిపింది 1-6-5. కన్ను గ్రుచ్చి చూచేవారికి ఈ నలుపు కనిపిస్తుందని 'తర్ధ్వేనాంత సమాహిత దృష్టార్ దృశ్యతే' అని ఆచార్య శంకరులు ఈ ప్రవచానికి భాష్యం వ్రాశారు. సూర్యదేవతలకు సర్వసామాన్యమైన వైదికమంత్రం అయిన 'రధౌ నాష్టేన రసజా వర్తమాన నివేశనన్నమృతం మర్త్యం చ హిరణ్మయేన సతా దేవో యాతి' అని ఉపనిషత్తులో అభివ్యక్తమౌతున్నది. వైజ్ఞానికులు ఈ విషయాన్ని అంగీకరించారు. ఛాందోగ్యంలో ఒకచోట సూర్యుడికి పింగళత్వమూ, పీతత్వమూ, శుక్లత్వమూ లోహితత్వమూ కనిపిస్తున్నవి (అసౌవా ఆదిత్యః పిఙ్గళ ఏష శుక్ల ఏష నీల ఏష పీత ఏష లోహితః 8- 6-1) సూర్య గమనానికి సంబంధించిన కొన్ని సూక్తాలు ఋగ్వేదంలోనే కనిపిస్తున్నవి. రవి ముహూర్తానికి ఈ ముప్పది అంశలు నడుస్తాడని పురాణాలు చెపుతున్నవి.
పురాణాలు సూర్యుడు అగ్ని ప్రకృతి అనీ, (వాయు 53.30) సూర్య మండలము తేజోమయము అనీ, అది తెల్లనిదనీ (51.20) సూర్యుడే వాన కురిపిస్తాడనీ (51.21) గ్రహాలన్నింటిలో ఆద్యుడు ఆదిత్యుడనీ (53.111) నక్షత్రాలూ, చంద్రుడూ, గ్రహాలూ, సూర్య సంభవాలు (ఋక్ష చంద్రగ్రహా స్సర్వే విజ్ఞేయా స్సూర్య సంభవాః - వాయు 53. 28) ఇంకా ఎన్నో విశేషాలు పురాణాల వల్ల తెలుస్తున్నవి. (ప్రాచీన ఖగోళము వేలూరి శివరామశాస్త్రి. భారతి సర్వధారి, జ్యేష్ఠము పే. 51.53) సూర్యుని కిరణాలలో సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంయద్వను, అర్వావసు, స్వరత్ అనే కిరణాల వల్ల క్రమంగా చంద్రుడూ, నక్షత్రాలుంటాయి. బుధుడూ, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శనీ పరిపోషణ పొందుతున్నారన్న వాక్యాలు (వాయు 53-44-50) విశేషంగా గమనింపతగ్గవి. సూర్య కిరణాలు అసంఖ్యాకాలు. వాటిలో నాలుగు వందలు వర్షదాలు, వాటి కాంతి శబలము, మూడు వందలు మంచు కురిసేవి. ఇవి పీతవర్ణాలు. మూడు వందల కిరణాలు వేడిని చిమ్మేవి. వీటి రంగు తెలుపు (53-19 మొదలు 27).
416
వావిలాల సోమయాజులు సాహిత్యం-4