న్యాయమూ' శబ్ద సంబంధి. 'రథం కరోతీతి రథకారః' వ్యుత్పత్తి చేత రథకారశబ్దానికి 'రథముచేసేవా’డనే అర్థము. కాని ఒకానొక సంకీర్ణజాతివాడనీ అర్థము కలుగుతుంది. ఇది గౌణార్ధము. 'అవయవసిద్ధిః సముదాయసిద్ధి ర్బలీయసీ' - రూఢ్యర్థము బలవత్తరమైనది. అందువల్లనే పంకములో పుట్టిన ప్రతిప్రాణీ పంకజము కాదు. కేవలమూ పద్మము ఒక్కటే పంకజము.
శబ్దచ్ఛలానికి శబ్దమే ఆధారము. ఇది త్రివిధంగా ఉంటుంది. 1. వాక్ఫలము : రెండు అర్థాలున్నచోట వక్త అభిప్రాయానికి భిన్నార్థాన్ని ప్రతిపాదించి వాదించటము వాక్ఛలము. 'పిల్లవాడు నవకంబళుడు' అన్న చోట ప్రతిపక్షి 'తొమ్మిది కంబళ్లు కలవాడు' అని వాదించటము. 2. సామాన్య ఛలము : విశేష పదంగా సంభవించే అర్థాన్ని అతి సామాన్యపదంగా చెప్పి అసంభవార్థంగా మార్చటము. 'ఈ బ్రాహ్మణుడు పండితుడు' అని చెప్పినప్పుడు బ్రాహ్మణత్వా వచ్ఛేదకధర్మము పాండిత్యము అని చెప్పటాన్నే గ్రహించి, పండితులు కాని బ్రాహ్మణులు లేరా, అబ్రాహ్మణులు పండితులు లేరా అని వాదించడము. 3. ఉపచారచ్ఛలము : పదానికి శత్యార్థాన్ని గ్రహించకుండా లక్ష్యార్థము వివక్షితమైతే దాని వాచ్యార్థాన్ని గానీ, వాచ్యార్థం వివక్షితమైనప్పుడు లక్ష్యార్థాన్ని గానీ గ్రహించటము ఉపచారచ్చలము 'మంచెలు అరచుచున్నవి. పాగాలు పోవుచున్నవి' అన్నచోట 'మంచెలే అరచుచున్నవి. పాగాలే పోవుచున్నవి' అని వాదించటము. ఇందులో ఒకరు ముఖ్యార్థాన్నీ, మరొకరు గౌణార్థాన్నీ గ్రహించి వాదిస్తారు.
శబ్దార్థాన్ని లోకం స్వరమూ, ఊతల సహాయం వల్ల గ్రహిస్తూ ఉంటుంది. సందేహమూ, సంతాపమూ, ఆనందమూ ఆశ్చర్యమూ ఇత్యాది భావచ్చాయలు ఒక్కొక్కప్పుడు కేవలం అంగవిన్యాసాలతో కూడా చూపించవచ్చును. అందుకనే భగవత్పతంజలి 'అంతరేణాల పి శబ్ద ప్రయోగం బహవోర్దా గమ్యంతే అక్షనికోచైః, పాణి విహారైశ్చ' అని ప్రవచించాడు. చేతులు త్రిప్పి, గ్రుడ్లు తిప్పి చాలవరకు అర్థసంప్రత్యయం కలుగజేయవచ్చును అని ఆయన అభిప్రాయము. ఉచ్చారణవిధానాన్ని బట్టి శబ్దంలోని భావచ్చాయలను శ్రోతలు గ్రహిస్తూ ఉంటారు; అవగతము చేసుకోగలుగుతుంటారు; శబ్దాచ్చారణలో ఉండే ఎగుడు దిగుడులే లేకపోతే భాష శ్రుతికటువుగా ఉంటుంది. ఇది గమనించే సంస్కృత వైయాకరణులు ఉదాత్త అనుదాత్త స్వరితాలతో కూడిన శిక్షాశాస్త్రాన్ని కల్పించారు. స్వరం తప్పినప్పుడు శబ్దం అపశబ్ద మైపోతుందన్నారు. ప్రమాదవశాన యజ్ఞకర్త ఒక శబ్దాన్ని దుష్టంగా పలికితే
406
వావిలాల సోమయాజులు సాహిత్యం-4