Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైయాకరణులూ, మీమాంసకులూ శబ్దము నిత్యమంటారు. నైయాయికులు అనిత్యమంటారు. 'అర్థ కృతేన నామశబ్దేన భవితవ్యమ్' అంటే శబ్దం కేవలం శ్రుతికి తగిలి ఏదో అర్థసంప్రత్యయాన్ని కలుగజేసి కనబడకుండా పోతుంది. ముఖ్యమైనదని అర్థము అని వారి భావము. అంటే వాద్యంలో శబ్దం పూర్వము లేదనీ అది క్రొత్తగా వాయించడము వల్లనే పుట్టి వాయువు వల్ల అభివ్యక్తమై, అర్థసంప్రత్యయము కలిగిస్తున్నదని వారి అభిప్రాయము.

'కావ్యలక్ష్మి కి తనువగు శబ్దార్థంబులు' అని ఆలంకారిక నిర్వచనము. విద్యా సంబంధం వల్ల బ్రహ్మము ఏ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరత్వాలను ధరించాడో అదేవిధముగా శబ్దము సత్త్వరజస్తమో గుణాలను బట్టి వాచక, లక్షక, వ్యంజకత్వాలను ధరిస్తూ ఉన్నది.

'వాచ్యార్థో భిధయా బోధ్యో
లక్ష్యో లక్షణయా యుతః,
వ్యంగ్యో వ్యంజనయా తాస్స్యు
స్తిస్రః శబ్దస్య శక్తి మః'

అని సాహిత్య దర్పణకారుడు. అంటే అభిధాశక్తి వాచ్యార్థాన్నీ, లక్షణాశక్తి లక్ష్యార్థాన్నీ, వ్యంజనాశక్తి వ్యంగార్థాన్నీ నిరూపిస్తూ ఉంటవని అభిప్రాయము. శబ్దాలకు లోకంలో ఉండే ప్రయోగం గానీ, పరిణామం గానీ, విపరిణామం గానీ ఈ మూడు శక్తులలో ఒకదాన్ని అనుసరించి ఉంటుంది.

శబ్దాన్ని ఆధారం చేసుకొని సంస్కృత న్యాయాలు కొన్ని ఏర్పడ్డవి. ఒక్కొక్కప్పుడు స్వార్థాన్ని విడిచి అన్యార్థాన్ని బోధిస్తూ ఏదైనా న్యాయం ఉంటుంది. 'గంగాయాం ఘోషః' (గంగలో గొల్లపల్లె) అన్న చోట 'గంగ ఒడ్డున' అనే అర్థము. దీన్నే జహత్ స్వార్థావృత్తి న్యాయమంటారు.

మొదట శబ్దానికి ఒక అర్థాన్ని చెప్పి తరువాత దానికున్న సహజార్థముతో రెండూ ఒకటే అని చెప్పటము జహదజహత్ స్వార్థావృత్తిన్యాయము.

'యత్పరః శబ్దన్యాయం' మరొకటి. ముందు తేజస్సు పుట్టి తరువాత శబ్దం పుడుతుంది అని అనటం. అంటే అర్థవంతమైనదే శబ్దము అని అనటము. 'రథకార


సంస్కృతి

405