అనిర్దిష్టమైనది లోకంలో. దాని రూపాన్ని ఇదమిత్థమని నిర్ణయించటానికి వీలు లేదు. ఆధునిక రచయితలలో ప్రసిద్ధురాలు 'వర్జీనియా వుల్ఫ్' శబ్దజాలాన్ని గురించి వ్రాస్తూ ఇలా అన్నది :
"The art of writing which is just another name for beauty is the art of having at one's beck and call every word in the language, of knowing their weights, colours, sounds, associations and thus making them suggest more than they can suggest....Now this power of suggestion is one of the mysterious properties of words. Words are the wildest the freest, and most irresponsible, most inteachable of all things. They do not live in the dictionaries; they live in the minds. That pause was made the well of darkness was dropped to tempt words to come together in one of those swift marriages which are perfect images of ever - lasting beauty" శబ్దానికి శక్తి, సాంద్రతా, వర్ణమూ, వ్యక్తిత్వమూ ఉన్నవన్నమాట.
శబ్దజాలంలోని అన్యోన్యమైత్రి మూలంగా కాంతి, ఓజస్సు, సమత ఇత్యాది గుణాలు కలుగుతవని సాహితీవేత్తలు చెపుతుంటారు. దానివల్లనే రచనల్లో శైలి ఏర్పడుతూ ఉంటుంది. దానిని మన ప్రాచీన సాహిత్య లాక్షణికులు 'యా పదానాం పరాన్యోన్య మైత్రీ శయ్యేతి కథ్యతే' అన్నారు. కూర్పులో క్రొత్తందనము కలుగుతుంది గాబట్టే కవుల సమ్మోహనశక్తి నిత్యనూతనంగా పరిణమిస్తూ ఉంటుంది. 'యానేవ శబ్దాన్ వయ మాలపామో, యానేవ చార్థాన్ వయ ముల్లిఖామ, తై రేవ విన్యాస విశేషభవ్యైః సమ్మోహయంతే కవయో జగంతి' - అనే శబ్దాలు, అనే అర్థాలు. కాని వాటి విన్యాసంతోనే కవులు లోకాన్ని సమ్మోహపరుస్తారు అని కీర్తి పొందారు కవులు. దీన్నే ఉక్తివిశేషం అనవచ్చును. రాజశేఖరకవి 'ఉక్తివిశేషో కబ్బో' కావ్యము ఉక్తివిశేషము అన్నాడు. సాహితీ తాత్త్వికులు కొందరు కేవలము శబ్దమే కావ్యము అన్నవారున్నారు. శబ్దమన్నప్పుడు అర్థము దానిలోనే నిబద్ధమై ఉన్నదన్న మాట. 'రమణీయార్థ ప్రతిపాదకః శబ్దః కావ్యం' అన్న జగన్నాథ పండిత రాయల తాత్పర్యార్థము కూడా 'శబ్దము కావ్యము' అనే చెప్పవచ్చును. 'ఇష్టార్థ వ్యవఛ్ఛిన్నా పదావళీ' అన్న ఆచార్యదండి శబ్దశాస్త్ర రహస్యవేత్త. 'మాటలు మాటలు వచ్చును, మాటలనే కలుగుచుండు మణిమంత్రంబుల్, మాటల పొందిక తెలిసిన మాటలనే ముక్తి కలుగు మహిలో వేమా!' అన్నాడు తాత్త్వికుడు వేమన.
- <referencesఛ్ఛిన్నాఛ్ఛిన్నా/>
సంస్కృతి
403