యజ్ఞ సమయాలలో అధ్వర్యుడు, హోత, ఉద్గాత ముగ్గురూ ప్రధానులు. ఏదో దేవతను - ఉదాహరణానికి ఇంద్రుడనుకుందాము - మొదట అధ్వర్యుడు 'ఏహి ఇంద్రా' అని పిలుస్తాడు. ఇంద్రుడు రాడు. హోత మంత్రపూతంగా అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పటికీ రాడు. ఉద్గాత సామగానంతో ఇంద్రుడు సంతోషించి కామప్రదుడు కావటానికి బయలుదేరుతాడని పెద్దలు చెపుతారు.
ఒక్కొక్క స్వరానికి ఒక వర్ణమూ, ఒక రూపమూ ఉన్నవని శాస్త్రము చెపుతూ ఉన్నది. 'అందువల్లనే రాగ, రాగిణుల కల్పన జరిగింది. పాశ్చాత్యదేశాలల్లో ఆహతశబ్దశక్తిని గురించి అనేక పరిశోధనలు జరిగినవి. శబ్దానికి వర్ణాలున్నవనీ, అనేక రూపాలను సృజించే శక్తి ఆహత శబ్దానికున్నదనీ ఆ పరిశోధనలవల్ల నిరూపితమైనది. శబ్దము శ్రవణేంద్రియ మూలంగా శరీరంలో ప్రవేశించి విద్యుచ్ఛక్తి వలె పనిచేస్తుంది. శబ్దానికి ఓషధీగుణ మున్నదని నేటి ప్రకృతి శాస్త్రజ్ఞులు నిరూపిస్తున్నారు. దీపకము, వసంతము, మేఘాంబరి ఇత్యాది రాగాలవల్ల ఆహత శబ్దశక్తిని తాన్సేన్, గోపాలనాయకాది భారతీయ సంగీత శాస్త్రవేత్తలు నిరూపించారు. మహాధానుష్కుల మంత్రపూతమైన అస్త్ర ప్రయోగోప సంహారాలల్లో అసంబద్ధత ఉండనవసరం లేదు.
'శం సుఖం దదాతీతి నా శబ్దః - సుఖాన్ని ప్రసాదించేది కనుకనే శబ్దము. అందువల్లనే శబ్దాధిదేవత ఐన సరస్వతిని 'యా కుందేందుతుషార హారధవళా... నిశ్శేష జాడ్యాపహా' అని స్తుతిస్తున్నాము. శబ్దాన్ని 'శప్యతే అనేనేతి శబ్దః' - దీనిచేత ఆక్రోశింపబడుతుంది కాబట్టి శబ్దము అనీ నిర్వచనం చెయ్యవచ్చును. లోకంలో సుఖానికీ, దుఃఖానికీ శబ్దమే కారణమౌతుంది. అందుకనే ఒకానొక తత్త్వవేత్త అన్నాడు. 'మానవలోకంలో యుగయుగాలనుంచీ వస్తూ ఉన్న రాగద్వేషాలకూ, సుఖదుఃఖాలకూ శబ్దమే కారణము' అని.
మానవలోకంలో శబ్దం ఎంత పని చేయటానికి శక్తి కలిగినదో మనంఊహించలేము. బైరను మహాకవి 'డాన్ జాన్'లో ఇలా అన్నాడు :
"But words are things and a small drop of Ink - Falling like due, upon a thought produces - That which makes thousands, perhaps millions think' అని.
సంస్కృతి
401