- సమస్త వేదాలూ దేనినైతే మననం చేస్తున్నవో, సమస్త తపస్సులూ దేనిని వదిస్తున్నవో, దేనిని ఇచ్చించి బ్రహ్మచర్యము నడుపుతున్నారో - నేను దానిని గురించి సంగ్రహంగా చెపుతాను; అది 'ఓమ్' అని, ప్రణవాన్ని కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి చెప్పాడు. ప్రణవము పరబ్రహ్మ, హిరణ్య గర్భ స్వరూపము. త్రిమాత్రాకమైన ఓంకారాన్ని దర్శించినవాడే పరమ యోగి. 'అనాహత మతిక్రమ్య విశుద్ధ ప్రాణా న్నిరోధ్యాజ్ఞామను యాయన్ బ్రహ్మరంధ్రం ధ్యాయన్ త్రిమాత్రో హమిత్యేవం సర్వథా ధ్యాయన్ పశ్య త్యనాకారాశ్చభవతి' అని హంసోపనిషత్తు. అంటే అనాహత చక్రాన్ని అతిక్రమించి విశుద్ధ చక్రంలో ప్రాణాన్ని నిరోధించి ఆజ్ఞాచక్రంద్వారా బ్రహ్మరంధ్రాన్ని చేర్చి జ్ఞానపరుడై 'ఓం' కారాన్ని నేనని ధ్యానించే పురుషుడు, పరాన్ని వీక్షించి అనాకారుడౌతాడని అభిప్రాయము.
ఓంకారాన్ని ఆధారంగా చేసుకొని పరమ పురుషుణ్ణి ధ్యానిస్తే కర్మవిముక్తి కలుగుతుందనీ, సాధకుడు సూర్యసంపన్నుడై భాసిస్తాడనీ వేదంలో మరికొన్నిచోట్ల కనిపిస్తుంది. ఓంకారము వ్యక్తబ్రహ్మమట! అది అర్ధమాత్రాకము; అవ్యక్తము; కళాతీతము. ఏకైకశః దాన్ని ఉచ్చరిస్తే అందలి అ, ఉ, మ కారాలు మృత్యుతుల్యాలై బాధ పెట్టుతవనీ, ద్విమాత్రాకంగా ఉచ్చరిస్తే కొంతకాలం వ్యక్తి మనస్సులో లీనమై చంద్రలోకంలో వసించి తిరిగి జన్మిస్తాడనీ బృహదారణ్యకోపనిషద్వాక్యాల వల్ల వ్యక్తమౌతున్నది ముండకోపనిషత్తులో
"ప్రణవో ధనుః, శరో హ్యాత్మా,
బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే
అప్రమత్తేన వేదవ్యం
శరవత్ తన్మయో భవేత్”
అని ఉన్నది. ఓంకారము బాణము, ఆత్మ, ధనుస్సు, బ్రహ్మము లక్ష్యము. అప్రమత్తతతో ఓంకార శబ్దాన్ని లక్షిస్తే ఆత్మ బ్రహ్మంలో లీనమౌతుందని అభిప్రాయము. బ్రహ్మానికే సంకేతము ఓంకారము. సమస్తమూ బ్రహ్మము. సమస్తమూ శబ్దము. 'ఓ మిత్యేతదక్షర మిదగ్ం సర్వం, తస్యోపన్యాఖ్యానం భూతం భవద్భవిష్య దితి సర్వ మోంకార ఏవ' అని ప్రమాణము.
'ఓమ్ ఇత్యేకాక్షరం బ్రహ్మ' అన్నారు. మంత్రద్రష్టులైన మహర్షులు. ఆ బ్రహ్మను పురుష సూక్తం 'అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు, త్వం యజ్ఞ స్వం
398
వావిలాల సోమయాజులు సాహిత్యం-4