Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరమ శివుని స్వరూపమైన శబ్దంలోనుంచీ ఆకాశమూ, ఆకాశావచ్చిన్ను డైన ఈశానునివల్లా తచ్ఛక్తి ఐన పరాశక్తివల్లా శబ్దస్పర్శాత్మకమైన వాయువూ జనించింది. వాయుతత్త్వావచ్ఛిన్నుడైన తత్పురుషునివల్లా, తచ్ఛక్తి ఐన ఆదిశక్తివల్లా శబ్దస్పర్శ రూపాత్మకమైన వహ్ని స్పష్టమైంది. ఆ వహ్నికి అవచ్ఛిన్నుడైన అఘోరుడి వల్లా, తచ్ఛక్తి ఐన ఇచ్ఛాశక్తివల్లా శబ్దస్పర్శరూప రసాత్మకమైన జలం ఉద్భవించింది. తజ్జలా వచ్చిన్నుడైన నామదేవుడివల్లా, తచ్ఛక్తి అయిన జ్ఞానశక్తివల్లా శబ్దస్పర్శరూపరస గంధాత్మకమైన పృథివి ఆవిర్భూతమైనది.

ఇది మహాదేవమననంలోని పంచభూతోత్పత్తి కథనం. పాంచభౌతిక మైనది శరీరం. పంచ భూతాలకూ ప్రథమం ఆకాశం. ఆకాశం శబ్దగుణకము. శరీరము శబ్దం.

శబ్దము పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ - అనే నాలుగు అవస్థాభేదాలతో ఉన్నది. 'తురీయం వాచో మనుష్యా వదంతి' మానవుడు వైఖరీ వాక్కులతోనే వ్యవహారం నడుపుకుంటున్నాడు. 'గుహా త్రీణి నిహితా సంగయంతి' - గుహాశయమై లోపల శబ్దము పరా పశ్యంతీ మధ్యమ లనే మూడు అవస్థలూ పొందుతున్నది. దాన్ని యోగసాధన లేని సామాన్య మానవుడు తెలుసుకోలేడు. 'తాని విదు ర్బాహ్మణా యే మనీషిణః' మత్సరరహితులు, అలోపులూ, దర్పదంభ క్రోధ వర్జితులూ, బ్రహ్మవిద్యావేత్తలూ అయిన శిష్టులకు ఒక్కరికే శబ్దతత్త్వం సంపూర్ణంగా గోచరిస్తుంది. సామాన్య మానవులు కొంత కొంతగా వ్యాకరణ శాస్త్ర మూలంగా దానిని గ్రహించ వచ్చును. అందుకనే భగవత్పతంజలి 'మరణ ధర్మాణువులయిన మానవులను శబ్దతత్త్వాత్మకుడైన మహాదేవుడు ఆవేశించాడు; ఆ మహాదేవ పదవిని పొందాలంటే వ్యాకరణ శాస్త్రం చదివి తీరాలి' అన్నాడు. 'సక్తు మివ తిత ఉనా పునంతః యత్ర ధీరా మనసా వాచ మక్రత, అత్ర సుఖాయః సఖ్యాని జానతే, భద్రైషాం లక్ష్మీ ర్నిహితాధివాచి' - పేలాలను జల్లెడలో పట్టుకొని శోధించినట్లు శబ్దాలను శోధించి ప్రయోగిస్తే, వారు సత్పురుషులై సాయుజ్యాన్ని పొందుతారు; వారి వాక్కులో లక్ష్మి ఉంటుంది అని వేదము. 'ఏకః శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గేలోకే కామధుగ్ భవతి' అని అనటం వలన, శబ్దాన్ని తెలుసుకొని ప్రయోగిస్తే స్వర్గం మన పాలిటి కామధేనువు అవుతుందట!

'సర్వే వేదా యత్పద మామనంతి, తపాంసి సర్వాణి చ యద్ వదంతి, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్ తే పదం సంగ్రహేణ, బ్రవీ మ్యో మిత్యే తత్'


సంస్కృతి

397