“సౌరాగవస్త్రై ర్జరరక్షః వసంతో వసుభిస్సహ
సంవత్సరస్య సవితోః ప్రైషకుత్ప్రథమః స్మృతః"
అన్న తైత్తిరీయ వాక్యాన్ని బట్టి (1.3.2) వైదిక కాలంలో కూడా ఇలాగే వసంతారంభాన్ని గురించి, వత్సరారంభాన్ని గురించి భావించారని వ్యక్త మౌతున్నది.
"ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరిద్యామృతస్య
ఆపుత్రా అగ్నే మిధానాసో అత్ర సప్త సతాని వింశతిశ్చ తస్యుః”
(ఋగ్వేదమ్ - 1.23.11)
సుబ్రహ్మఃణ్యోం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యామ్ ఇంద్రాగచ్ఛ హరివ
ఆగచ్ఛ మేధాతేథౌః మేషవృషణ శ్వస్య మేనౌ
భారతీయుల "సౌర చాంద్ర వత్సరానికి” (Luni-Solar year) మాసాలు పన్నెండు. అశ్విని మొదలు రేవతి వరకూ ఉన్న ఈ సంవత్సరానికి మూడు వందల అరవై (360) నక్షత్ర దినాలుగా విభజించారు. ఈ విభజన సూర్యుడు కాంతి వృత్తంమీద ఒక డిగ్రీనుంచి మరొక డిగ్రీ వద్దకు నడిచే కాలాన్ని మాత్రమే తెలియజేస్తవి. ఈ మూడు వందల అరవై నక్షత్ర దినాలు కూడా ఋగ్వేద సంహితా కాలంనాటివే.
ద్వాదశ ప్రథమ శ్చక్రమేకం త్రీణి నఖ్యాని క ఉతశ్చి కేత
తస్మిన్యాకం త్రిశతాన శంకమోర్పితా షష్ఠి ర్నిచలాచలాసః
ఈ 'నక్షత్రదినము', 'స్థల-కాలము' (Space-Time) గ విభజితమైంది.
"క్షౌద మభ్రం నివేశిత్ క్వాయమ్ సంవత్సరాం మిధః
క్వాహక్వేయం దేవరాత్రీ, క్వమాసా ఋతవః శ్రితాః
అర్ధమాసా ముహుర్తాః నిమేషా సృరిభి స్సహ”
అని తైత్తిరీయారణ్యకంలో ఉంది.
వారంలోని దినాలకు 'శక'మనీ తత్సంబంధమైన జ్ఞానానికి 'శకం జ్ఞాన' మనీ అన్నారు. ఋగ్వేద సంహితలో (మండలము 1, అనువాకము 22 సూక్తము 6 సూత్రము 48.) సంవత్సరానికి పన్నెండు నెలలయ్యే 360 శకాలున్నట్లు ఉన్నది. తైత్తిరీయారణ్యకంలో వారాల వరుసను గురించి ఇలా ఉన్నది (ప్రశ్న - అనువాకము 3. పంచతి 1)
394
వావిలాల సోమయాజులు సాహిత్యం-4