తదుపరి మళ్లీ భూమిమీదికి ఎలా అవతరిస్తున్నారో ఆ ఆరోహణ అవరోహణ క్రమాన్ని ఉపనిషత్తులు మనోహరంగా వర్ణించి వున్నాయి. అందు పుణ్యాత్ములు పుణ్యభేదాన్ని బట్టి ద్వివిధాలైన గతులను పొంది వుంటారు. అందు ఉత్తమ పుణ్యులగతి అర్చిరాది మార్గము. సామాన్యపుణ్యుల మార్గము ధూమ్రాది మార్గము. అర్చిరాది మార్గగతులు పునర్జన్మ నొందక శాశ్వత బ్రహ్మలోకాన్ని చేరుకొంటారు; ధూమ్రాది మార్గగతులు స్వర్గ ఫలాన్ని అనుభవించి తిరిగి భూమిమీదికి వస్తారు. అలా రావటంలో మొదట వారు తమ పుణ్యలోకాల నుంచి వెనుకకు మళ్ళీ ఆకాశాన్నీ, అక్కడినుంచి వాయురూపాన్నీ, దానినుంచి ధూమభావాన్నీ దానినుంచి మేఘభావాన్నీ పొంది వర్షరూపంతో వీప్రియవాది ఓషధులై, వాటిని భుజించిన స్త్రీ పురుషుల శోణిత శుక్లరూపాన్ని పొంది మాతృగర్భం నుంచి అవతరిస్తున్నారని ఛాందోగ్యోపనిషత్తు ఇలా వ్యక్తం చేసింది.
“తస్మిన్ యావత్ సంపాతముషిత్వా అధైతమే వాధ్వానం పున
ర్నివర్తనే యథేత మాకాశా ద్వాయుః వాయు ర్భూత్వా
ధూమో భవతి ధూమోర్భూత్వా అభ్రం భవతి"
ఛాం. (5-10-5, 6)
పైన వర్ణింపబడ్డ రీతిగా పుణ్యఫలంగా గానీ, పాపఫలంగా గానీ జననమరణాలను పొందటం అంతా దుఃఖరూపమే అనీ, ఇది అంతా సంసారమే అనీ, ఇట్టి సంసారం నుంచీ విముక్తిని పొందటము అంటే జననమరణాలు ఎన్నటికీ కలుగుకుండా ఉండటమే ఉత్తమస్థితి అనీ, దానినందువాడే ఉత్తముడనీ శాస్త్రాలు చెప్పుతున్నవి.
ఇట్టి జనన మరణ రూపమైన సంసారం నుంచి కలిగిన విముక్తినే “మోక్షము” అని ఉపనిషత్తులు పేర్కొంటున్నవి. మోక్షము అంటే విడుచుట, విడివడుట అని అర్థం. ఇట్టి మోక్షస్థితి తాను ఎవరో తన స్వరూపాన్ని అనుభవపూర్వకంగా గుర్తెరిగినట్లయితే కలుగుతుంది. అని "జ్ఞానా దేవతు కైవల్యం" అన్న శ్రుతుల చేత తెలుస్తున్నది. అంటే లోకంలో దుస్తులను ధరించిన ఒక సామాన్యవ్యక్తి దుస్తులతో గూడిన తననే ఫలాని వ్యక్తిగా భావిస్తూ, దుస్తులు తనకంటే భిన్నమైనవని ఎలా భావింపజాలడో, అలాగే మానవుడు చైతన్య రూపమైన తన స్వస్వరూపం కంటె అంగీలవంటి స్థూల సూక్ష్మాది శరీరాలు వేఱయినవని తలపలేక, ఆ శరీరాలే తన రూపమని భావిస్తున్నాడు. అందుచేత నతనికంటె భిన్నమైన శరీరాదులకు కలిగిన బాధలను తనకు గలిగిన బాధలుగా భావిస్తూ అనేకమైన యాతనలను అనుభవిస్తున్నాడు.
సంస్కృతి
391