పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

University of Bombay Vo. XVIII part I) వీటి పౌర్యాపర్యాలను గురించి చరిత్రకారులు చర్చింపవలసి ఉంది.

ఆంధ్రదేశంలో ఈ సంక్రాంతి పండుగ మూడు దినాలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగ లంటారు. భోగినాడు తెల్లవారక ముందే 'భోగిమంటలు' వేసుకొని తలంటి పోసుకుంటారు. ఇవి బలిచక్రవర్తి ఏలుబడిలో ఉండే దినాలని ఒక నమ్మకం కూడా ఆంధ్రదేశంలో ఉంది. ఇది ఇంద్రసంబంధమైన పండుగనీ, వర్షాలూ, చలీ అంతం పొందించినందుకు అతనిని పూజించటమనీ కొందరి అభిప్రాయం. భోగినాటి సాయంత్రం బొమ్మలు పెట్టిస్తారు. ఇది బాలబాలికలకు పూర్వకాలంలో చిత్రకళ శిల్చకళలతో పరిచయం కలిగించటమని భావించవచ్చును. అ నాడే 'గవిరమ్మ'లు పెట్టి ముత్తయిదువలు మూడునాళ్ళూ చందన తాంబూలాది సత్కారాలతోనూ, పూజా పునస్కారాలతో పూజించి కనుమనాడు సాయం కాలం నదులున్నచోట నదుల్లోనూ, లేకపోతే వాపీ కూపాదుల్లోనూ ఓలలాడిస్తారు. అంతకు ముందు మేళతాళాలతో ఊరేగింపు జరుగుతుంది.

'గవిరమ్మ పూజ' ఆశ్వయుజ మాసంలో జరగవలసిన పండుగ. గవిరమ్మ కృషికి అధిదేవత. అమెను పూజించటము భంగ్యంతరముగా చంద్రోపాసన. ఆయన కృపవల్ల పంటలు బాగా పండినందుకు కృతజ్ఞత చూపిస్తూ కార్తిక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, 'చంద్రపూజ' చేయటము ఆర్య సంప్రదాయము. కర్షకులు 'గవిరమ్మ' పండుగను అతివైభవంగా జరుపుతారు. భోగినాడు రాత్రి ఒక రవికగుడ్డ, బియ్యం మోయిన, దక్షిణ తాంబూలంతో కమ్మరి ఇంటికి వెళ్ళి, అతడు అంతకుముందు నిర్మించి ఉంచిన సంక్రుమయ్య విగ్రహాలను మేళతాళాలతో తీసుకోవచ్చి, పండుగనాడు, కనుమనాడూ పూజించి గౌరమ్మతోపాటు ఓలలాడిస్తారు. భోగినాడు సాయంత్రం బిడ్డలకు పళ్ళు పోసి ముత్తయిదువలకు వాళ్ళచేత తాంబూలాలిప్పించి దీవెనలు పొందుతారు. కనుమ పండుగతో ప్రారంభించి నూతన వధువులు సావిత్రీ గౌరి నోములు ప్రారంభించి తొమ్మిది దినాలు తొమ్మిది నైవేద్యాలతో, అనేక నియమాలతో శ్రద్ధాభక్తులతో చేస్తారు. పుట్టింటి పాక శాస్త్ర విజ్ఞానాన్ని నేర్చుకోవటమా ఇది అనిపిస్తుంది - నేడు కొంచెం ఊహించేవాళ్ళకు ఈ సావిత్రీ గౌరీ నోములు. అకలంక పాతివ్రత్యము దీనికి ముఖ్యోద్దేశం. అ సందర్భంలో సావిత్రి ఆదర్శమూర్తి.

సంక్రాంతి పండుగను పితృదినంగా పెద్దలు భావిస్తారు. అ నాడు తర్చణాదికాలు వదిలి పెడతారు. శ్రద్ధాభక్తులతో 'సావిత్రి' జపిస్తారు. పూర్వరాజన్యులు హేమాద్రివ్రత ఖండంలోని దానాలు చేసేవాళ్ళు. ఆంధ్రదేశంలో రాజులు వేయించిన దానశాసనాలలో ____________________________________________________________________________________________________

346

వావిలాల సోమయాజులు సాహిత్యం-4